నేరాలు చేసి తప్పించుకు తిరుగుతున్నా వారి గుట్టు విప్పేందుకు కొత్త సాఫ్ట్‌వేర్ ...

- April 17, 2016 , by Maagulf
నేరాలు చేసి తప్పించుకు తిరుగుతున్నా వారి గుట్టు విప్పేందుకు కొత్త సాఫ్ట్‌వేర్ ...

పన్నులు చెల్లించని వారు, నేరాలుచేసి తప్పించుకు తిరిగేవారు, బకాయిలు ఉన్నవారు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు దుర్వినియోగం చేసేవారు.... ఇక ఎక్కువకాలం తప్పించుకునే అవకాశం లేదు. ఇటువంటివారి గుట్టు విప్పేందుకు ఓ సరికొత్త సాఫ్ట్‌వేర్ సిద్ధమవుతోంది. నల్లా బిల్లు చెల్లించి కరెంటు బిల్లు బకాయిపడినా, వాణిజ్య పన్ను చెల్లిస్తూ ట్రేడ్ లైసెన్సు తీసుకోకపోయినా, నేరాలు చేసి తప్పించుకు తిరుగుతున్నా ఈ సాఫ్ట్‌వేర్ వెంటనే పట్టేస్తుంది. అన్నింటికి మించి ప్రభుత్వ సంక్షే మ కార్యక్రమాల్లో జరుగుతున్న అవకతవకలు బయటపడే అవకాశముంది.ప్రభుత్వ సమాచార సాంకేతిక శాఖ(ఐటీ) ఆధ్వర్యంలో సమీకృత ప్రజా సమాచారం కేంద్రం(ఇంటిగ్రేటెడ్ పీపుల్ ఇన్ఫర్మేషన్ హబ్, ఐపీఐహెచ్) పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ సరికొత్త సాఫ్ట్‌వేర్ త్వరలోనే అమల్లోకి రాబోతోంది. 360 డిగ్రీస్ ఫ్రేమ్‌వర్క్ అని పిలుస్తున్న ఈ సాఫ్ట్‌వేర్‌లో అన్ని ప్రభుత్వ శాఖల డేటానూ అనుసంధానం చేస్తున్నారు. ఈ తరహా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడం దేశం లోనే మొదటిసారి కావడం గమనార్హం. ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్సులు, ప్రకటనల పన్ను తదితర అంశాలే జీహెచ్‌ఎంసీకి ప్రధాన ఆదాయమార్గాలు. అయితే సిబ్బంది అవినీతితోపాటు అనేక ఇతర కారణాల వల్ల పూర్తిస్థాయిలో పన్నులు వసూలు కావడంలేదు. అలాగే, విద్యుత్ కనెక్షన్లు సుమారు 35లక్షలు ఉండగా, ఆస్తిపన్ను మాత్రం 13.5 లక్షలు మాత్రమే ఉన్నాయి.వాణిజ్య పన్నుల జాబితాలో 2.5లక్షల మంది ఉండగా, ట్రేడ్ లైసెన్సులు మాత్రం 1.5లక్షలు మాత్రమే ఉన్నాయి. నీటి కనెక్షన్లు సుమారు తొమ్మిది లక్షల వరకూ ఉన్నాయి. ఒకదానికి మరోదానికి పొంతన లేకుండా ఉంది. గతంలో మంజూరై న ఇళ్లకు, క్షేత్రస్థాయిలో నిర్మించిన ఇళ్ల సంఖ్యకు పొంతనలేదు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, రేషన్ కార్డులు తదితర సంక్షేమ పథకాల్లోనూ నిత్యం అవకతవకలు వెలుగుచూస్తున్నాయి. విద్యుత్ బిల్లులు క్రమం తప్పకుండా చెల్లిస్తున్న అనేక మంది ఆస్తిపన్ను మాత్రం చెల్లించడం లేదు. అలాగే, వ్యాపారాలు చేస్తూ కమర్షియల్ ట్యాక్స్ చెల్లిస్తున్నవారు ట్రేడ్ లైసెన్సు పొందడంలేదు. అంతేకాదు, అనేకమంది మోసాలకు పాల్పడి, నేరాలు చేసి తప్పించుకు తిరుగుతున్నారు. అయినా వారి ఆస్తులకు ఢోకాలేకపోగా వ్యాపారా లు యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. అన్నిటికి మిం చి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలపై ఏటా సుమారు రూ. 25000 ఖర్చుచేస్తోంది. ఇందులో అసలు లబ్ధ్దిదారులెందరో, నకిలీలు ఎందరో, ఒకటికన్నా ఎక్కువసార్లు లబ్ధ్దిపొందుతున్నవారు ఎందరో అర్థంకావడంలేదు.బోగస్ ఓటర్లను గుర్తించినట్లుగానే... ఈ తరహా పరిస్థితికి ప్రధాన కారణం ఒక శాఖకు మరోశాఖకు మధ్య సమన్వయం లేకపోవడం. దీన్ని దృష్టిలో ఉం చుకొని ప్రభుత్వం 360 డిగ్రీస్ ఫ్రేమ్‌వర్క్ పేరుతో ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ పీపుల్ ఇన్ఫర్మేషన్ హబ్‌కు రూపకల్పన చేస్తోంది. ఈ సాఫ్ట్‌వేర్‌కు అన్ని ప్రభుత్వ శాఖల సమగ్ర సమాచారాన్ని అనుసంధానం చేస్తున్నారు. ఈ సాఫ్ట్‌వేర్ సహాయంతో పేరు, చిరునామా, ఫోన్ నెంబరు, పాన్ నెంబరు, ఆధార్ నెంబరు, ఓటర్ ఐడీ తదితర ఏదోఒక చిరునామా ఆధారంగా సంబంధిత వ్యక్తుల వివరాలన్నీ ఇట్టే తెలిసిపోతాయి. ఉదాహరణకు ఒక వ్యక్తిపేరు, తండ్రిపేరు, ఫోన్ నెంబరు తదితర వివరాలు కంప్యూటర్‌లో ఎంటర్ చేయగానే, ఆ వివరాలతో సంబంధమున్న అన్ని శాఖల వివరాలూ బయటకు వస్తాయి.ఇటీవల బోగస్ ఓటర్ల వివరాలను సైతం ఇదేవిధమైన సాఫ్ట్‌వేర్ సహాయంతో ఆధార్ నెంబర్ ఆధారంగా గుర్తించిన విషయం తెలిసిందే. ముఖ్యం గా పోలీసు శాఖకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందనే ఉద్దేశం తో ఆ శాఖ ప్రత్యేక శ్రద్ధతో దీని రూపకల్పనకు నడుం బిగిం చింది. ఇతర శాఖల మాదిరిగా ఇందులో జీహెచ్‌ఎంసీ సైతం భాగస్వామ్యమవుతోంది. దీనివల్ల పన్నులు ఎగ్గొడుతున్నవారు, అండర్ అసెస్‌మెంట్లు, అన్ అసెస్‌మెంట్ ఆస్తుల వివరాలు, అక్రమంగా సాగుతున్న వ్యాపారాలు తదితర వివరాలు తెలుసుకునే వీలు కలుగుతుంది. క్షేత్రస్థాయిలో పరిశీలన తప్పనిసరి... అయితే సాఫ్ట్‌వేర్ ద్వారా గుర్తించిన వివరాలను మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భా ల్లో వ్యక్తులు వేరైనా వివరాలు ఒకే విధంగా ఉంటే సాఫ్ట్‌వేర్ గుర్తిస్తుంది. అలాగే, ఏదైనా ప్రభుత్వ శాఖ డేటాబేస్‌లో వివరాలు పొరపాటుగా నమోదయ్యే అవకాశం లేకపోలేదు. అందుకే సాఫ్ట్‌వేర్ గుర్తించిన వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే అధికారులు ఓ నిర్ధారణకు వస్తారు. ప్రస్తుతం మీసేవతోపాటు వివిధ ప్రభుత్వ శాఖలన్నీ ఇందు లో భాగస్వాములవుతున్నాయి. తాజాగా దీహెచ్‌ఎంసీ కూ డా ఈ సాఫ్ట్‌వేర్‌లో భాగమైంది. బకాయిదారుల వివరాలతోపాటు అసలు పన్నులు కట్టకుండా తప్పించుకు తిరుగుతున్నవారి వివరాలు దీనిద్వారా తెలుసుకునే వీలుంది దేశంలోనే మొదటిసారి రూపొందిస్తున్న ఈ సాఫ్ట్‌వేర్‌ను అధికారులు నేడు పరిశీలించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com