EWA కంట్రోల్ సెంటరును తనిఖీ చేసిన విద్యుత్ మంత్రి
- September 21, 2022
బహ్రెయిన్: ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (EWA) ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ల నియంత్రణ కేంద్రాన్ని విద్యుత్, నీటి వ్యవహారాల శాఖ మంత్రి యాసర్ బిన్ ఇబ్రహీం హుమైదాన్ సందర్శించారు. కేంద్రంలోని పనుల పురోగతిని, సేవల నాణ్యత, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే తీరును మంత్రి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఇబ్రహీం హుమైదాన్ మాట్లాడుతూ.. నియంత్రణ కేంద్రంలోని పర్యవేక్షణ, ఆపరేషన్ ప్రక్రియలు అధిక స్థాయి సంసిద్ధత, విశ్వసనీయతను పెంచుతాయన్నారు. బహ్రెయిన్‌లో మౌలిక సదుపాయాలు, ఇంధన స్థిరత్వం రంగంలో లక్ష్యాలను సాధించడానికి అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఇందుకోసం నియంత్రణ యంత్రాంగాల అభివృద్ధిని నిరంతరం పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. విద్యుత్, నీటి పంపిణీ నెట్‌వర్క్ ప్రాథమిక పనితీరు సూచికలను మెరుగును కొనసాగిస్తామని మంత్రి ఇబ్రహీం హుమైదాన్ తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







