10 మిలియన్ దిర్హామ్‌లను గెలుచుకున్న కార్ వాష్ వర్కర్
- September 21, 2022
దుబాయ్: నెలకు Dh1300 సంపాదించే నేపాల్ కార్ వాషర్ భరత్ బీకే (31).. మహ్జూజ్ డ్రాలో 10 మిలియన్ దిర్హామ్‌లను గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ.. మూడు సంవత్సరాల క్రితం దుబాయ్‌కి వచ్చినప్పుడు బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న తన 25 ఏళ్ల తమ్ముడికి చికిత్స చేసేందుకు డబ్బు సంపాదించడమే తన లక్ష్యంగా ఉందన్నారు. ఇద్దరు పిల్లల తండ్రి అయిన భరత్ కి ఇంకా బ్యాంకు అకౌంట్ లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో భరత్ కు బ్యాంక్ ఖాతా తెరవడంలో సహాయం చేయనున్నట్లు మహ్జూజ్ ఆపరేటర్, EWINGS సీఈఓ ఫరీద్ సామ్జీ తెలిపారు. భరత్ కు ఐదేళ్ల కొడుకు, మూడేళ్ల కూతురు ఉన్నారు. గెలిచిన డబ్సుతో వాళ్ల భవిష్యత్ తీర్చిదిద్దనున్నట్లు భరత్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 27న నేపాల్‌కు తిరిగి వెళ్లాలని ప్లయిట్ టిక్కెట్ కొనుగోలు చేశానని, ఈ క్రమంలో చివరి సారి లాటరీలో లక్కును పరిక్షించుకోవాలని నిర్ణయించుకొని ఇద్దరు స్నేహితులతో కలిసి లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేసినట్లు భరత్ వివరించారు. మహ్జూజ్ భారీ బహుమతిని గెలుచుకున్న మొదటి నేపాల్ ప్రవాసుడు భరత్. అలాగే డ్రా చరిత్రలో అతి తక్కువ సంపాదన కలిగిన విజేతలలో ఒకరు కావడం విశేషం.
తాజా వార్తలు
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్‌కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్‌లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!









