అబుధాబిలో పాక్షికంగా కూలిన మస్జీదు
- September 23, 2022
యూఏఈ: అబుధాబిలో నిర్మాణంలో ఉన్న ఓ మస్జీదు పాక్షికంగా కూలిపోయింది. ఈ ఘటనలో గాయపడిన వారిని అధికారులు ఆసుపత్రికి తరలించారు. అల్ బతీన్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మస్జీదులో కొంత భాగం కూలిపోయిన ప్రదేశాన్ని సమాచారం అందగానే అబుధాబి పోలీసులు, అబుదాబి సివిల్ డిఫెన్స్ అథారిటీ బృందాలు చేరుకొని అక్కడున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు పోలీసు ఉన్నతాధికారులు చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ఘటనలో కొందరికి స్వల్ప గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. కూలిన మస్జీదును చూసేందుకు ఎవరూ రావొద్దని, అధికారిక మార్గాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని ప్రజలకు అబుధాబి పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







