పబ్ ల యాజమన్యంతో సైబరాబాద్ సీపీ సమీక్ష సమావేశం
- September 24, 2022
హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధి లోని పబ్ ల యాజమన్యంతో ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట హై కోర్టు ఆదేశాల గురించి అవగాహన కల్పించి, అన్ని నిబంధనలు మరియు లైసెన్సింగ్ నిబంధనలకు లోబడి ఉండాలన్నారు.
తక్కువ వయస్సు గల వ్యక్తులను పబ్ లకు అనుమతించవద్దన్నారు. నిబంధనలకు లోబడి శబ్దాలు / ధ్వని స్థాయిలు ఉండాలని పబ్ యజమానులకు సూచించారు. బ్యాకప్‌తో కూడిన CCTV కెమెరాలను మరియు ఫీడ్‌ను పర్యవేక్షించడానికి, ప్రాంగణాన్ని సౌండ్‌ప్రూఫ్ చేయడానికి, వాలెట్ డ్రైవర్లను నిమగ్నం చేయడానికి, సిబ్బంది మరియు కస్టమర్లను పరీక్షించడానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని కూడా మేనేజ్మెంట్లకు సూచించారు.
సైబరాబాద్ పరిధి లోని పబ్ ల నిర్వహణ బాధ్యతాయుతంగా నిర్వహించాలని, నగరం, రాష్ట్ర ఖ్యాతిని నిలబెట్టాలన్నారు. సౌండ్ పొల్యూషన్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత యజమాన్యందే అన్నారు.పబ్బులపై ప్రజల నుండి కొన్ని ఫిర్యాదులను వస్తున్నందున నివాసితులకు అసౌకర్యం కలిగించవద్దన్నారు.బాధ్యతాయుతమైన రీతిలో వ్యాపారాలు చేసుకోవాలని, నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించి పౌరులకు ఎటువంటి అసౌకర్యాన్ని కల్పించొద్దన్నారు.
ఈ సమావేశంలో సైబరాబాద్ సీపీ తో పాటు జాయింట్ సీపీ శ్రిబ్అవినాష్ మహంతి, ట్రాఫిక్ డీసీపీ శ్రుతి శ్రీనివాస్,మాదాపూర్ డీసీపీ శ్రీమతి శిల్పవల్లి,ఎస్బి ఏడీసీపీ రవి కుమార్, ఇన్స్పెక్టర్లు పబ్ ల యాజమాన్యాలు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









