బాలయ్యా.. మజాకానా.! ఎన్టీయార్ పేరు మార్పు పై బాలయ్య ఫైర్.!
- September 24, 2022
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ పేరుని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ మార్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఘాటుగా స్పందించారు. తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
‘మార్చెయ్యడానికీ తీసెయ్యడానికీ ఎన్టీయార్ అన్నది పేరు కాదు.. ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక..’ అంటూ బాలయ్య పేర్కొన్నారు.
‘తండ్రి గద్దెనక్కి ఎయిర్ పోర్టు పేరు మార్చాడు.. కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మార్చుతున్నాడు. మిమ్మల్ని మార్చడానికి ప్రజలున్నారు, పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త..’ అంటూ నందమూరి బాలకృష్ణ నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని హెచ్చిరించారు.
‘అక్కడ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసం లేనివాళ్ళని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయి. శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు..’ అంటూ నందమూరి బాలకృష్ణ సినీ ఫక్కీలో డైలాగుల మీద డైలాగులు వదిలారు.
బాలకృష్ణ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. ఈ విషయంపై ఇప్పటికే జూనియర్ ఎన్టీయార్ సహా, పలువురు నటులు స్పందించారు. కేవలం తెలుగు దేశం పార్టీ నేతగానే కాదు, స్వర్గీయ ఎన్టీయార్ తనయుడిగా బాలకృష్ణ స్పందించిన తీరును నందమూరి అభిమానులు ప్రశంసిస్తున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







