‘పొన్నియన్ సెల్వన్ 1’ మరో బాహుబలి అవుతుందా.?
- September 24, 2022
గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న మణిరత్నం డైరెక్షన్‌లో ఒక్కసారి అయినా నటించాలని నటీనటులు ఊగిపోతుంటారు. అలాంటి మణిరత్నానికి నలభై ఏళ్ల కలగా మారిపోయిన ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’. అప్పుడెప్పుడో కమల్ హాసన్ హీరోగా ఈ సినిమాని రూపొందించాలనుకున్నాడట మణిరత్నం.
కానీ, కుదరలేదు. లెజెండరీ నటీ నటుల్ని ఈ సినిమాలో భాగం చేయాలనుకున్నాడట. సెట్ కాలేదట. ఎట్టకేలకు ఇన్నాళ్లకు విక్రమ్ హీరోగా ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదికెళ్లింది. విక్రమ్‌తో పాటూ, జయం రవి, కార్తి ఈ సినిమాలో సపోర్టింగ్ హీరోలుగా నటించారు.
ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్లుగా నటించారు. సెప్టెంబర్ 30న ఈ సినిమాని వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్న ఈ సినిమా మొదటి భాగాన్ని ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సందర్భంగా ‘పొన్నియన్ సెల్వన్ 1’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని హైద్రాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈ ఈవెంట్ సందర్భంగా ఆయా నటీనటులంతా హైద్రాబాద్‌లో సందడి చేశారు. సినిమాని అందరూ తప్పకుండా చూసి ఆదరించాలని కోరుకున్నారు. అయితే, బాహుబలి స్థానం బాహుబలిదేననీ, కానీ, ‘పొన్నియన్ సెల్వన్ 1’ మరో అద్భుతమైన చిత్రమవుతుందనీ ఈ సందర్భంగా నటుడు కార్తి వ్యాఖ్యానించాడు.
తాజా వార్తలు
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









