మిల్కీ బ్యూటీకి ‘బబ్లీ’గా భలే ఛాన్స్‌లే.!
- September 24, 2022
మిల్కీ బ్యూటీ తమన్నా పని అయిపోయిందనుకున్న ప్రతిసారీ ఏదో ఒక స్టన్నింగ్ రోల్‌తో మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతుంటుంది. అలాగే, ‘సైరా నరసింహారెడ్డి’ టైమ్‌లో తమన్నాకి వచ్చిన ‘లక్ష్మి’ పాత్ర ఆ కోవకు చెందిందిగానే చెప్పుకోవచ్చు.
ఈ మధ్య మళ్లీ మిల్కీ బ్కూటీ తమన్నాపై కాస్త నెగిటివిటీ అలుముకుంటోంది. ఇటీవలే ‘ఎఫ్ 3’ సినిమాతో ఓ సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నప్పటికీ, ఎందుకో ఆ క్రెడిట్ తమన్నాకి అస్సలు దక్కలేదు. టోటల్ క్రెడిట్ అంతా వెంకీ, వరుణ్‌లే కొట్టుకెళ్లిపోయారు.
ఈ లోగా, అనుకోకుండా ‘బబ్లీ బౌన్సర్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది మిల్కీ బ్యూటీ తమన్నా. ఓటీటీలో ఈ సినిమాని రిలీజ్ చేశారు. డిస్నీ హాట్ స్టార్‌లో ప్రస్తుతం ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో స్ర్టీమింగ్ అవుతోంది.
ఓటీటీ ప్రేక్షకులు ఈ సినిమాని బాగా ఆదరించారు. బబ్లీ బౌన్సర్‌గా తమన్నా నటన ఆకట్టుకుంది. కూల్ ఎమోషనల్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తమన్నాకి ప్రశంసలు దక్కుతున్నాయ్ ఈ సినిమాతో. తమన్నా పని అయిపోయిందిలే అనుకున్న టైమ్‌లో మళ్లీ బబ్లీ బౌన్సర్ రూపంలో ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యిందో చూశారుగా.
త్వరలో మెగాస్టార్ చిరంజీవితో ‘భోళా శంకర్’ సినిమాతో రాబోతోంది మిల్కీ బ్యూటీ తమన్నా.
తాజా వార్తలు
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి







