సమంత అమెరికా వెళ్లింది ఎందుకో తెలిసిపోయిందిగా.!

- September 24, 2022 , by Maagulf
సమంత అమెరికా వెళ్లింది ఎందుకో తెలిసిపోయిందిగా.!

సమంతకు ఏదో అనారోగ్యంతో బాధపడుతోందనీ, గతంలో ఆమె ఫేస్ చేసిన అరుదైన స్కిన్ ఎలర్జీ ఆమెను ఈ మధ్య మళ్లీ వేధిస్తుందనీ అందుకే, సమంత సందడి సోషల్ మీడియాలో ఎక్కడా కనిపించడం లేదంటూ, ఈ మధ్య పుకార్లు షికార్లు చేశాయ్.
అలాంటిదేం లేదంటూ సమంత మేనేజర్ క్లారిటీ ఇచ్చినా ఈ పుకార్లు ఆగనే లేదు. లేటెస్టుగా సమంత అమెరికా యానం కట్టిందనీ, అందుకు కారణం కూడా ఆమె అనారోగ్యమే అంటూ ఆ పుకార్లు నెక్స్‌ట్ లెవల్‌కి చేరాయి. 
అయితే, అసలు విషయం తేలిపోయింది. సమంత అమెరికా ప్రయాణం కట్టడానికి కారణమేంటా.? అని కూపీ దారులు కూసింత గట్టిగానే కూపీ లాగేశారు. 
సమంత సినిమాలో పాటూ, కొన్ని వెబ్ సిరీస్ ప్రాజెక్టులతోనూ బిజీగా వున్న సంగతి తెలిసిందే. అందులో కీలకమైన వెబ్ సిరీస్‌ని ‘ఫ్యామిలీ మేన్’ మేకర్లు రూపొందిస్తున్నారు. ప్రముఖ అమెరికన్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’‌కి రీమేక్‌గా రూపొందుతోన్న ఈ వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు. లీడ్ రోల్ మాత్రం సమంతదే.
సమంతతో ‘ఫ్యామిలీ మేన్ 2’ రూపొందించిన రాజ్ డీకే ఈ సిరీస్‌నీ రూపొందిస్తున్నాడు. యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ డ్రామాగా రూపొందుతోన్న ఈ వెబ్ సిరీస్ కోసమే సమంత అమెరికా వెళ్లిందట. కొన్ని యాక్షన్ సీన్స్‌ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోబోతోందట అమెరికాలో సమంత. అద్గదీ అసలు సంగతి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com