అబుధాబి గ్యాస్ ప్లాంట్‌లో పేలుడు.. తప్పిన పెను ప్రమాదం
- September 25, 2022
అబుధాబి: శనివారం తెల్లవారుజామున అబుధాబి ఇండస్ట్రియల్ జోన్‌లోని గ్యాస్ ప్లాంట్‌లో మంటలు చెలరేగడంతో సివిల్ డిఫెన్స్ అథారిటీ స్పందించిందని అబుధాబి పోలీసులు తన సోషల్ మీడియా ఛానెల్‌లలో తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారని, ప్రస్తుతం అవి శీతలీకరణ ప్రక్రియలో ఉన్నాయని అధికారులు తెలిపారు. పేలుడుకు గల కారణాలను అన్వేషించేందుకు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించామని, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు అయినట్లు సమాచారం లేదన్నారు. పుకార్లను ప్రచారం చేయవద్దని, ఎమిరేట్‌లోని సంబంధిత, విశ్వసనీయ అధికారులు ఇచ్చే సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని అబుధాబి పోలీసులు నివాసితులను కోరారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







