మ్యాన్‌హోల్‌లో పడ్డ కార్మికుడిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది
- September 25, 2022
కువైట్: సభాన్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం మురుగునీటి మ్యాన్‌హోల్‌లో పడిన కార్మికుడిని సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్ సిబ్బంది వెలికితీశారని జనరల్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా విభాగం తెలిపింది. వర్షాకాలానికి సన్నాహకంగా ఆరో రింగ్‌రోడ్డులోని సభాన్ ప్రాంతంలో ఉన్న మ్యాన్‌హోల్ మురుగునీటి వ్యవస్థను శుభ్రం చేస్తుండగా.. ఇద్దరు కార్మికులు అందులో పడిపోయినట్లు కేంద్ర ఆపరేషన్స్ విభాగానికి సమాచారం వచ్చిందన్నారు. వెంటనే అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని, మ్యాన్‌హోల్ వెలుపల ఉన్న కార్మికులలో ఒకరు అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించి ప్రథమ చికిత్స అందించారని తెలిపారు. అలాగే మ్యాన్‌హోల్‌లో ఉన్న మరో వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీసి ఫోరెన్సిక్‌కు అప్పగించినట్లు జనరల్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ తెలిపింది.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







