అబుధాబి గ్యాస్ ప్లాంట్‌లో పేలుడు.. తప్పిన పెను ప్రమాదం

- September 25, 2022 , by Maagulf
అబుధాబి గ్యాస్ ప్లాంట్‌లో పేలుడు.. తప్పిన పెను ప్రమాదం

అబుధాబి: శనివారం తెల్లవారుజామున అబుధాబి ఇండస్ట్రియల్ జోన్‌లోని గ్యాస్ ప్లాంట్‌లో మంటలు చెలరేగడంతో సివిల్ డిఫెన్స్ అథారిటీ స్పందించిందని అబుధాబి పోలీసులు తన సోషల్ మీడియా ఛానెల్‌లలో తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారని, ప్రస్తుతం అవి శీతలీకరణ ప్రక్రియలో ఉన్నాయని అధికారులు తెలిపారు. పేలుడుకు గల కారణాలను అన్వేషించేందుకు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించామని, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు అయినట్లు సమాచారం లేదన్నారు. పుకార్లను ప్రచారం చేయవద్దని, ఎమిరేట్‌లోని సంబంధిత, విశ్వసనీయ అధికారులు ఇచ్చే సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని అబుధాబి పోలీసులు నివాసితులను కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com