60,000 SR కన్నా ఎక్కువ విలువైన లగేజీ ఉంటే డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాల్సిందే

- September 25, 2022 , by Maagulf
60,000 SR కన్నా ఎక్కువ విలువైన లగేజీ ఉంటే డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాల్సిందే

సౌదీ అరేబియా: సౌదీ అరేబియా జకాత్ విభాగం  (పన్నులు, కస్టమ్స్ అథారిటీ) ZATCA కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి సౌదీ కి వచ్చే వారైనా, సౌదీ నుంచి విదేశాలకు వెళ్లే వారైనా 60 వేల రియల కన్నా ఎక్కువ లగేజీ తీసుకెళ్తే డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలని కోరింది. ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్  అధికారులకు తమ వస్తువుల వివరాలు వాటి విలువ చెప్పాల్సి ఉంటుంది. 60 వేల రియల కన్నా తక్కువ విలువ ఉన్న వస్తువులను ఎలాంటి డిక్లరేషన్ లేకుండా తీసుకెళ్లవచ్చు. అంతకంటే ఎక్కువ విలువ ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులు, గోల్డ్, విదేశీ కరెన్సీ ఇలాంటి వాటికి తప్పకుండా డిక్లరేషన్ ఫామ్ నింపాల్సి ఉంటుంది. ప్రయాణికులు కస్టమ్స్ పన్ను ఎగ్గొట్టకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com