స్వాతిముత్యం ట్రైలర్ రిలీజ్ డేట్..
- September 25, 2022
హైదరాబాద్: బెల్లం కొండ గణేష్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గణేష్ హీరోగా యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్వాతి ముత్యం అనే సినిమాను నిర్మిస్తున్నారు.వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంతో..లక్ష్మణ్.కె. కృష్ణ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ కార్య క్రమాలు జరుపుకుంటుంది. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్య క్రమాలను స్పీడ్ చేసారు.
ఇప్పటికే పలు పాటలు విడుదలై ఆకట్టుకోగా..తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ ను అధికారిక ప్రకటన చేసారు. రేపు సోమవారం ఉదయం 11 గంటల 7 నిమిషాలకు ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేయనున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్షవర్థన్, పమ్మిసాయి, గోపరాజు, రమణ శివనారాయణ , సురేఖా వాణి, సునైనా, దివ్యశ్రీపాద తదితరులు నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?
- కువైట్ ఎయిర్పోర్ట్ T5 నుండి డైరెక్ట్ ఫ్లైట్స్.. జజీరా ఎయిర్వేస్
- ఖతార్ లో కమ్యూనిటీ రన్నింగ్ సెషన్లు ప్రారంభం..!!
- సంస్కరణల దిశగా రిమోట్ వర్క్.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమోదం..!!
- సాక్ష్యంగా ఈమెయిల్.. BHD11,000 దావా కొట్టివేత..!!
- గూగుల్ పే, ఫోన్ పేలకు పోటీగా వాట్సాప్..
- ప్రధాని మోదీ పై ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు!
- ప్రధాని తెలంగాణ పర్యటనకు ముహుర్తం ఫిక్స్..
- గాజా యుద్ధం తర్వాత తొలి ఎన్నికలలో ఓటు వేయనున్న పాలస్తీనియన్లు









