రూ. 999కే స్వదేశీ విమాన టికెట్
- April 18, 2016
ఇప్పటికే ప్రారంభమైన బుకింగ్ బెంగళూరు చౌక ధరలకే విమాన టికెట్లను అందించే ఎయిర్ ఏషియా సంస్థ మరోసారి అత్యంత చవకైన ఆఫర్ ప్రకటించింది. భారతదేశంలో ఉన్న నగరాలకైతే పన్నులన్నింటితో కలుపుకొని రూ. 999కి, విదేశాలకు అయితే రూ. 2,999కే టికెట్లు ఇస్తామని తెలిపింది. తాము 22 దేశాల్లోని 100 నగరాలకు విమానాలు నడిపిస్తున్నామని, తాము ఇప్పుడు అందిస్తున్న ఈ ప్రమోషనల్ ఆఫర్‌తో దేశ విదేశాలు చుట్టి రావాలనుకునేవారికి మంచి అవకాశం వచ్చినట్లు అవుతుందని ఎయిర్ ఏషియా కమర్షియల్ విభాగం అధిపతి స్పెన్సర్ లీ ఓ ప్రకటనలో తెలిపారు.ఈ ఆఫర్ కింద బుకింగ్స్ సోమవారమే ప్రారంభమయ్యాయి. ఈనెల 24 వరకు టికెట్లు బుక్ చేసుకోవ్చు. అయితే ఈ సంవత్సరం అక్టోబర్ 1 నుంచి వచ్చే సంవత్సరం మే 22లోగా ప్రయాణాలు చేయడానికి మాత్రమే ఇప్పుడు టికెట్లు ఇస్తారు. మన దేశంలో విశాఖపట్నం, బెంగళూరు, ఢిల్లీ, కొచ్చిన్, చండీగఢ్, గోవా, గువాహటి, ఇంఫాల్, పుణె, జైపూర్ నగరాలకు రూ. 999 టికెట్‌తో వెళ్లొచ్చు. అలాగే కౌలాలంపూర్, బ్యాంకాక్, బాలి, మెల్బోర్న్, పెర్త్, మనిలా లాంటి 100 నగరాలకు రూ. 2,999 టికెట్‌తో వెళ్లొచ్చని ఎయిర్ ఏషియా ప్రకటించింది.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







