‘బిగ్’ ఎలిమినేషన్: బిగ్‌బాస్‌కి వాళ్లంటే అస్సలు నచ్చరా.?
- September 26, 2022
బిగ్‌బాస్ షో మూడో వారం ఎలిమినేషన్‌లో భాగంగా నేహా చౌదరిని హౌస్ నుంచి బయటికి పంపించేశారు. నిజానికి నేహా చౌదరిలాంటి కంటెస్టెంట్ బిగ్‌బాస్ హౌస్‌కి అర్హురాలు. తనవంతు ఆట ఆడింది. స్టఫ్ క్రియేట్ చేసింది. వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కూడా.
కానీ, బిగ్‌బాస్ షోకి స్ర్టాంగ్ కంటెస్టెంట్స్ అంటే అర్ధం వేరే వుంది కాబోలు. ఎవరైతే ఆట ఆడతారో, స్ర్టాంగ్ అనిపిస్తారో వాళ్లనే ఇంటి నుంచి త్వరగా బయటికి పంపించేస్తుంటాడు. మొదటి వారం బయటికి వచ్చేసిన ఇద్దరిలో షానీ సంగతి అటుంచితే, అభినయశ్రీ ఎలిమినేషన్ పట్ల అనేక రకాల అనుమానాలున్నాయ్.
ఇక మూడో వారం కూడా అంతే. నేహా చౌదరి అస్సలు ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంటే కాదు. లీకు వీరుల ద్వారా అందిన సమాచారం ప్రకారం నేహా చౌదరియే ఎలిమినేట్ క్యాండిడేట్ అనుకున్నా కానీ, అంచనాలకు మించి బిగ్‌బాస్ ఏదో మ్యాజిక్ చేస్తాడని ఆడియన్స్ భావించారు.
కానీ, అలాంటి మ్యాజిక్కులేమీ బిగ్‌బాస్ హౌస్‌లో జరగవని మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇక, నేహా చౌదరి విషయానికి వస్తే, అప్పుడే వచ్చేస్తానని అస్సలు అనుకోలేదు.. అంటూ ఆశ్చర్యానికి గురైంది నేహా చౌదరి. నేహా చౌదరి మంచి డాన్సర్. అప్పియరెన్స్, స్ర్కీన్ ప్రెజెన్స్, గేమ్ స్ర్టాటజీ.. ఇలా ఏది తీసుకున్నా, తనకంటూ కొన్ని ఇంటెలిజెంట్ స్కిల్స్ వున్నాయ్.
కానీ, ఏం లాభం.? పేరుకే బిగ్ గేమ్ షో. ఎవరైతే బాగా ఆడరో, వాళ్లకే హౌస్‌లో చోటు.. రూల్ ప్రకారం గేమ్ ఆడేవాళ్లని బిగ్‌బాస్ అస్సలు నచ్చడు.. అని రాను రాను మరింత బలంగా ప్రూవ్ చేసుకుంటున్నాడు బిగ్‌బాస్.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







