బాక్సాఫీస్ వద్ద తలపడనున్న మెగాస్టార్, కింగ్.! గెలుపెవరిదో.!
- September 26, 2022
దసరా కానుకగా ఈ సారి బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాలు పోటీ పడనున్నాయ్. టాలీవుడ్ అగ్ర హీరోలైన మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ సినిమా ఒకటి కాగా, కింగ్ నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ సినిమా ఇంకోటి.
అక్టోబర్ 5న ఈ రెండు సినిమాలూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయ్. రెండు సినిమాలూ పోటా పోటీగా ప్రమోషన్లు నిర్వహిస్తున్నాయ్. ఇద్దరూ తమ తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడంతో పాటూ, నా ఫ్రెండ్ సినిమా కూడా అదే రోజు రిలీజ్ వుంది.. రెండు సినిమాలూ మంచి విజయం దక్కించుకోవాలని ఆశిస్తున్నాం.. అంటూ ఇద్దరూ చెబుతుండడం విశేషం.
అన్నట్లు ఈ రెండు సినిమాలపైనా మంచి అంచనాలున్నాయ్. రెండూ బాలీవుడ్‌లో రిలీజ్ అవుతున్న సినిమాలే. ‘ఆచార్య’ ఫ్లాప్ తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న సినిమా ‘గాడ్ ఫాదర్’. రీమేక్ సినిమానే అయినా భారీ కాస్టింగ్‌తో భారీ అంచనాలతో చిరంజీవి ఇమేజ్‌ని మరింత రెట్టింపు చేసేలా ఈ సినిమాని మోహన్ రాజా తెరకెక్కించారు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పాత్ర సినిమాకి మరో అస్సెట్. నయనతార, సత్యదేవ్, సునీల్, పూరీ జగన్నాధ్ తదితరులు ఇతర కీలక తారాగణం. అలాగే నాగార్జున ‘ది ఘోస్ట్’ విషయానికి వస్తే, విషయమున్న డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
నువ్వా.? నేనా.? అంటూ దసరా బరిలో దిగుతోన్న ఈ రెండు సినిమాల్లోనూ అసలు సిసలు విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







