సింగపూర్ లో అంగరంగ వైభవంగా దసరా వేడుకలు ప్రారంభం...

- September 27, 2022 , by Maagulf
సింగపూర్ లో అంగరంగ వైభవంగా దసరా వేడుకలు ప్రారంభం...

సింగపూర్: సింగపూర్ నందు నివసిస్తున్న ఆర్యవైశ్యులు మొట్టమొదటిసారి వినూత్నంగా దేవినవరాత్రుల రోజుల్లో ఒక్కోరోజున ఒక ఇంటి చొప్పున మొత్తం తొమ్మిది మంది గృహాల్లో వాసవీమాత వివిధరకాల అలంకారములతో అమ్మవారిని అలంకరించి భక్తులందరూ అక్కడికి చేరి అనునిత్యము ఉదయం విష్ణుసహస్ర నామములు, మరియు సాయంత్రము అమ్మవారి ప్రత్యేక అలంకరణతో పాటుగ అమ్మవారి లలితా సహస్రము, మణిదీప వర్ణన, అమ్మవారి భజనలు, కీర్తనలు ఆలపించాలని నిర్ణయించి మహాలయ అమావాస్య నాడు అంకురార్పణ చేసుకొని తదుపరి తొమ్మిదిరోజుల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అలానే బాలత్రిపురసుందరి  స్వరూపాలైన కన్యపిల్లలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.  

కార్యక్రమ వివరాలు 
26 సెప్టెంబర్- బ్రహ్మచారిణి దేవి అలంకారం - ముక్కా ఇంద్రయ్య వారి గృహము నందు  
27 సెప్టెంబర్- చంద్రగంట అలంకారం - VCMS
28 సెప్టెంబర్- కుశ్మండ అలంకారం - వంకదార సుబ్రహ్మణ్యం వారి గృహము నందు  
29 సెప్టెంబర్- స్కంద మాత అలంకారం - VCMS 
30 సెప్టెంబర్- కాత్యాయిని అలంకారం - అంకంశెట్టి మకేష్ వారి గృహము నందు  
1 అక్టోబర్ - కాళరాత్రి అలంకారం - AR పురుషోత్తం వారి గృహము నందు  
2 అక్టోబర్ - శైలపుత్రి అలంకారం  - VCMS
3 అక్టోబర్ - సిద్దిధాత్రి అలంకారం - కర్నాటి శ్రీనివాసరావు వారి గృహము నందు  
4 అక్టోబర్ - మహాగౌరి అలంకారం  - నరేంద్ర కుమార్ నారంశెట్టి వారి గృహము నందు  

శ్రీ మారియమ్మన్ కోవెలలో జరుగబోవు మహాకుంభాభిషేక క్రతువులో భాగంగా వైశ్యులందరు ఈ సంవత్సరం నిత్యనామస్మరణ మహాయజ్ఞానికి శ్రీకారంచుట్టి ఈ సంవత్సర దసరా వేడుకలను ఈ విధంగా రూపొందించారు. అలాగే ఈ నిత్య పారాయణాలు మరియు దేవినవరాత్రి ఉత్సవాల్లో భక్తులు అందరు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవలెనని క్లబ్ అధ్యక్షులు అరుణ్ కుమార్ గొట్లూరి మరియు సెక్రటరీ నరేంద్రకుమార్ నారంశెట్టి వార్లు సంయుక్త ప్రకటనలో వైశ్యులందరికి తెలియజేయడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com