ఎక్స్ పో సిటీ దుబాయ్ చూసేందుకు వన్ డే పాస్ ను ప్రవేశ పెట్టిన ప్రభుత్వం
- September 27, 2022
దుబాయ్ : దుబాయ్ లోని ప్రఖ్యాత ఎక్స్ పో సిటీ దుబాయ్ ప్రదర్శనను చూసేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించారు. ఎక్కువ మంది ఈ ఎక్స్ పో ను విజిట్ చేసేందుకు వీలుగా వారికి తక్కువ ధరకే వన్ డే పాస్ ను అందుబాటులోకి తెచ్చారు. 120 దిర్హామ్ లు చెల్లించి ఈ పాస్ తీసుకోవచ్చు. అక్టోబర్ 1 నుంచి ఇది అందుబాటులో ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా ఈ పాస్ తీసుకోవచ్చు. ఈ పాస్ ఉన్న వారు విజన్ పెవిలియన్, ఉమెన్స్ పెవిలియన్, టెర్రా - ది సస్టైనబిలిటీ పెవిలియన్, అలీఫ్ - ది మొబిలిటీ పెవిలియన్‌లను చూడొచ్చు. 12 ఏళ్ల లోపు పిల్లలకు మాత్రం ఎక్స్ పో కు ఉచితంగా ప్రవేశం కల్పించారు. విజన్ పెవిలియన్ లో UAE వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ జీవిత విశేషాలు, ఆయన నాయకత్వం సామర్థ్యానికి సంబంధించి అంశాలతో పాటు ఆయన బాల్య విశేషాలు ఉంటాయి. ఉమెన్ పెవిలియన్ లో మహిళల అభివృద్ధి సమానత్వానికి సంబంధించిన విశేషాలు పొందుపరిచారు. ఎక్స్ పో సిటీ దుబాయ్ నిర్వాహకులు, స్కూల్ స్టూడెంట్స్, ఇతర ప్రొగ్రామింగ్ విద్యా సంస్థలు తక్కువ ధరలకే ఎక్స్ పో చూసేందుకు అనుమతి ఇస్తున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారం కోసం www.schools.expocitydubai.comలో చూడవచ్చు.
తాజా వార్తలు
- దోహా నుండి సురక్షితంగా స్వదేశానికి ఇండియన్..!!
- దమ్మామ్‌లో ఫార్మా కంపెనీకి భారీ జరిమానా..!!
- యూఏఈలో 9 రోజులపాటు సెలవులు? విమాన ఛార్జీలకు రెక్కలు..!!
- కువైట్ లో అకాడమిక్ డిగ్రీలపై కఠిన చట్టాలు..ఇక జైలు శిక్ష..!!
- బెలారస్ కు బయల్దేరిన ఒమన్ సుల్తాన్..!!
- యుఎస్ నావల్ కమాండర్‌కు ఆర్డర్ ఆఫ్ బహ్రెయిన్ ప్రదానం..!!
- టిసిస్ ఉద్యోగుల తొలగింపు..
- విశాఖ స్టేడియంలోని రెండు స్టాండ్లకు మిథాలీ రాజ్, రవికల్పన పేర్లు..
- సుప్రీంకోర్టులో CJI గవాయ్ పై దాడికి యత్నం
- మద్యం సేవించి వాహనాలు నడిపితే ఇక జైలుకే: సీపీ సజ్జనార్