కరోనా కేసులు తగ్గటంతో నిబంధనలు సడలించి యూఏఈ
- September 27, 2022_1664254630.jpg)
యూఏఈ : కరోనా కేసులు భారీగా తగ్గటంతో నిబంధనలు సడలిస్తున్నట్లు యూఏఈ ప్రకటించింది. గత మూడు నెలలుగా ఒక్క కరోనా మరణం కూడా ఇక్కడ జరగలేదు. పైగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. దీంతో మాస్క్ నిబంధనను సడలించారు. విమానాల్లో, స్కూల్స్ లో మాస్క్ అవసరం లేదని ప్రకటించారు. ఐతే విమాన సంస్థలు మాస్క్ నిబంధన తప్పనిసరిగా అమలు చేయాలనుకుంటే వారికే ఆప్షన్ ఇచ్చారు. రేపటి నుంచి నిబంధనల సడలింపు అమల్లోకి వస్తుంది. ఐతే హాస్పిటల్స్, మసీదులు, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో మాత్రం మాస్క్ తప్పనిసరిగా ధరించాలనే నిబంధన పెట్టారు. కోవిడ్ రోగులు, కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారు, ఫుడ్ సర్వీస్ చేసే డెలివరీ బాయ్స్ కచ్చితంగా మాస్క్ లు ధరించాలని ప్రకటించారు. ప్రస్తుతం యూఏఈ లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. రోజుకు 300 లోపే కొత్త కేసులు రావటంతో నిబంధనలు సడలించారు.
తాజా వార్తలు
- దోహా నుండి సురక్షితంగా స్వదేశానికి ఇండియన్..!!
- దమ్మామ్‌లో ఫార్మా కంపెనీకి భారీ జరిమానా..!!
- యూఏఈలో 9 రోజులపాటు సెలవులు? విమాన ఛార్జీలకు రెక్కలు..!!
- కువైట్ లో అకాడమిక్ డిగ్రీలపై కఠిన చట్టాలు..ఇక జైలు శిక్ష..!!
- బెలారస్ కు బయల్దేరిన ఒమన్ సుల్తాన్..!!
- యుఎస్ నావల్ కమాండర్‌కు ఆర్డర్ ఆఫ్ బహ్రెయిన్ ప్రదానం..!!
- టిసిస్ ఉద్యోగుల తొలగింపు..
- విశాఖ స్టేడియంలోని రెండు స్టాండ్లకు మిథాలీ రాజ్, రవికల్పన పేర్లు..
- సుప్రీంకోర్టులో CJI గవాయ్ పై దాడికి యత్నం
- మద్యం సేవించి వాహనాలు నడిపితే ఇక జైలుకే: సీపీ సజ్జనార్