ఒక్కో పాఠశాల అవసరాలకు 4,000 దీనార్లు: కువైట్ విద్యాశాఖ
- September 27, 2022
కువైట్: కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి బ్యాచ్ స్కూల్ ఫండ్ విడుదలైందని, సంబంధిత ప్రభుత్వ పాఠశాలల ఖాతాల్లో వాటిని జమ చేసినట్లు విద్యా మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ యూసఫ్ అల్-నజ్జర్ తెలిపారు. ఒక్కో పాఠశాల అవసరాలకు 3,500- 4,000 దీనార్ల మధ్య అందుతాయన్నారు. 75 శాతం కేటాయింపులు పూర్తి చేసినట్లు.. రెండవ దశ చెల్లింపులు (25 శాతం)లను వచ్చే ఏప్రిల్లో పంపిణీ చేయనున్నట్లు అల్-నజ్జర్ వివరించారు. ఈ ఫండ్ పాఠశాల హెడ్ మాస్టర్ ఆధీనంలో ఉంటందన్నారు. ఈ నిధులను స్టేషనరీ, కార్యాలయ సామాగ్రి, వాటర్ ట్యాంక్లు కడగడం, మరుగుదొడ్లు మరమ్మతులు, చిన్నపాటి నిర్వహణ పనులకు ఖర్చు చేయొచ్చన్నారు.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







