సౌదీలో న్యాయవాదిపై సస్పెన్షన్ వేటు

- September 27, 2022 , by Maagulf
సౌదీలో న్యాయవాదిపై సస్పెన్షన్ వేటు

సౌదీ: ఒక కంపెనీని అవమానించినందుకు, ఆ సంస్థ పరువు తీసినందుకు ఒక న్యాయవాదిని ఒకటిన్నర సంవత్సరాల పాటు న్యాయవాద వృత్తి నుండి దూరంగా ఉండాలని న్యాయ మంత్రిత్వ శాఖలోని న్యాయవాదుల క్రమశిక్షణా కమిటీ సస్పెండ్ చేసింది. దీంతోపాటు న్యాయవాదిపై మోపబడిన అభియోగాలకు చట్టపరమైన ప్రక్రియలు తీసుకోవాలని కూడా కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది.  సదరు న్యాయవాది న్యాయ వ్యవస్థ, న్యాయవాదుల వృత్తిపరమైన ప్రవర్తనా నియమాలను ఉల్లంఘించినట్లు  గుర్తించినట్లు కమిటీ తెలిపింది. అలాగే న్యాయ వ్యవస్థ, దాని కార్యనిర్వాహక నిబంధనలు,  న్యాయవాదుల వృత్తిపరమైన ప్రవర్తనా నియమాలను ఉల్లంఘించిన నలుగురు న్యాయవాదులపై కమిటీ శిక్షాత్మక క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు న్యాయవాదుల క్రమశిక్షణా కమిటీ పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com