చందమామను వద్దు బాబోయ్ వద్దంటోన్న బన్నీ ఫ్యాన్స్.!
- September 28, 2022
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతోన్న ‘పుష్ప 2’ ఊరించి ఊరించి ఇటీవలే సెట్స్ మీదికి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ అనీ, స్ర్కిప్ట్ వర్క్ అనీ.. అదనీ, ఇదనీ ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేసేందుకే డైరెక్టర్ సుకుమార్ బోలెడంత టైమ్ తీసుకున్నారు.
ఎలాగైతేనేం, ఎట్టకేలకు సినిమా స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్‌లో బిజీగా వుంది ‘పుష్ప 2’ టీమ్. ఇదిలా వుంటే, ఈ సినిమాకి సంబంధించి ఓ కీలకమైన అప్‌డేట్ ఒకటి తాజాగా చక్కర్లు కొడుతోంది.
అదేంటంటే, ఈ సినిమా కోసం చందమామ కాజల్ అగర్వాల్ రెండో సారి ‘స్పెషల్’ అవతారమెత్తబోతోందట. గతంలో ‘జనతా గ్యారేజ్’ సినిమా కోసం తొలిసారిగా కాజల్ అగర్వాల్ స్పెషల్ సాంగ్‌లో నటించింది. ఒకింత నెగిటివిటీ మూట కట్టుకున్నా ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
ఇప్పుడు అల్లు అర్జున్ కోసం ఇంకోసారి కాజల్ స్పెషల్‌గా హాట్ స్టెప్పులేసేందుకు రెడీ అవుతోందట. ‘పుష్ప’లో సమంతతో ‘ఊ అంటారా ఊ ఊ అంటారా’ సాంగ్‌తో ఫ్యాన్స్‌కి స్పెషల్ కిక్కెక్కించిన సుకుమార్, ఈ సారి కాజల్‌తో ఆ స్పెషల్ కిక్‌కి స్కెచ్ రచించాడనీ తెలుస్తోంది.
అయితే, కాజల్ ఇటీవలే ఓ బిడ్డకి తల్లి అయిన సంగతి తెలిసిందే. సో, ఆంటీతో స్పెషల్ సాంగ్ చేయిస్తారా.? అంటూ బన్నీ ఫ్యాన్సే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. అయితే, ఇప్పటికే ఈ డీల్ సెట్ అయిపోయిందనీ తెలుస్తోంది. చూడాలి మరి, నిజంగానే చందమామ స్పెషల్ సాంగ్ చేస్తుందో.? లేక ఇదంతా వట్టి గాలి మాటలేనో.!
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







