పిల్లర్‌ను ఢీకొన్న వాహనం.. ఇద్దరు మృతి
- September 28, 2022
అబుధాబి: క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న కాంక్రీట్ పిల్లర్‌ను ఓ వాహనం బలంగా ఢీకొన్నది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు అబుధాబి పోలీసుల ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ తెలిపింది. డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో వాహనం అదుపుతప్పి పిల్లర్‌ను ఢీకొట్టిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించినట్లు.. గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల వివరాలను అధికారులు వెల్లడించలేదు. మృతుల కుటుంబాలకు అబుదాబి పోలీసులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వ్యక్తి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదాల నివారణకు వాహనదారులు జాగ్రత్తగా వాహనాలు నడపాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!







