2016-17 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల ప్రకారం 2.2 లక్షల ఉద్యోగాలు..
- April 18, 2016
లక్ష్యంగా నిర్దేశించుకున్న కేంద్రం రెండేళ్ల కాల పరిమితిలో 2.2 లక్షల ఉద్యోగాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2016-17 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల ప్రకారం 2017 మార్చి 1 నాటికి వీటిని పూర్తిచేయాలని యోచిస్తోంది. 2015 మార్చి 1 నాటికి 33.05 లక్షలు ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం 34.93 లక్షలకు చేరింది. తాజాగా నిర్దేశించిన కాలానికి ఈ కొలువుల సంఖ్య 35.23 లక్షలకు పెరుగుతుందని అంచనా.వీటిలో మూడేళ్లుగా ఒక్క నియామకం కూడా చేపట్టని రైల్వే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అన్నింటికంటే ఎక్కువగా రెవెన్యూ శాఖలో 70 వేలు, ఆ తరువాత పారామిలిటరీ దళాల్లో 47 వేలు, హోంశాఖలో 6 వేల పోస్టులు పెరిగాయి. కాగా, కీలకమైన గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగుల సంఖ్య 538 నుంచి 472కు తగ్గడం విశేషం. ఇదిలావుంటే కేంద్ర మంత్రిత్వ శాఖల పరిధిలో భర్తీ చేయాల్సిన ఉద్యోగాల సంఖ్య ఏటికేడూ పెరిగిపోతోంది. ప్రస్తుతం ఆరు లక్షల ఖాళీలున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







