భూకంప మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని...!
- April 18, 2016
: ఈక్వెడార్ భూకంప మృతుల సంఖ్య సోమవారానికి 350కు చేరింది. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని, శిథిలాల నుంచి క్షతగాత్రుల్ని రక్షించేందుకు సహాయక సిబ్బంది నిరంతరం శ్రమిస్తోందని దేశాధ్యక్షుడు రఫేల్ కొరెయా తెలిపారు. దేశంలోని పసిఫిక్ సముద్ర తీర ప్రాంత నగరాల్లో వందల ఇళ్లు, హోటళ్లు నేలమట్టమయ్యాయి. రాజధాని నగరం క్విటో మాత్రం పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. భవనాలకు పగుళ్లు , కరెంట్ సరఫరా నిలిచిపోవడం తప్ప పెద్దగా నష్టం సంభవించలేదు.దేశంలోని ఆయిల్ పరిశ్రమకు కూడా ఎలాంటి నష్టం వాటిల్లలేదు. పోర్టోవీజోలో జైలు గోడలు కూలిపోవడంతో 100 మంది ఖైదీలు తప్పించుకున్నారు. బాగా దెబ్బతిన్న పోర్టోవీజోలో శిథిలాల నుంచి దుర్వాసన వస్తుండడంతో చిక్కుకున్న వారిని రక్షించే చర్యల్ని వేగవంతం చేశారు. బాగా దెబ్బతిన్న రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి విధించడంతో ప్రజల హక్కులు, స్వేచ్ఛ తాత్కాలికంగా రద్దయ్యాయి. పొరుగు దేశం కొలంబియాలోను కొంతమేర నష్టం జరిగింది.తమవారి కోసం శిథిలాల వద్ద పడిగాపులు శిథిలాల కింద చిక్కుకున్న తమవారిని రక్షించాలంటూ మాంటా నగరంలో పలువురు రోధిస్తూ కన్పించారు. శిథిలాల్ని తొలగిస్తూ కుటుంబసభ్యుల్ని రక్షించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు అందరినీ కలచివేస్తున్నాయి. తన భర్త శిథిలాల కింద చిక్కుకున్నాడని, రక్షించాలంటూ వెరోనికా పాలాడినెస్ వాపోతూ చెప్పింది. తన శక్తి కొద్దీ శిథిలాల తొలగిస్తూ భర్త బయటకు వస్తాడని ఆశగా ఎదురుచూస్తోంది. మాంటా నగరంలోని ఇలాంటి దృశ్యాలెన్నో చూపరులకు కంటతడి పెట్టిస్తున్నాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







