ఐఎస్ సిరియాపై యుద్ధం ప్రకటించింది ..
- April 18, 2016
సిరియాపై యుద్ధం ప్రకటిస్తున్నట్టు ఐఎస్ ఉగ్రవాద అనుబంధ సంస్థ జైష్-ఎల్-నస్ర్ ప్రకటించింది. కాగా, ఐరాస భద్రతామండలి 2254వ తీర్మానం ప్రకారం...ఈఏడాది ఫిబ్రవరి 27 నుంచి సిరియాలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం పట్ల అంగీకారం తెలిపిన సంస్థలకు అమెరికా, రష్యా భద్రతా బలగాలు రక్షణ కల్పిస్తాయి. అయితే, అల్నుస్రా, ఐఎస్ ఉగ్రవాద సంస్థలను ఈ ఒప్పందం నుంచి మినహాయించారు. ఆయా సంస్థలకు చెందిన ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలని భద్రతా మండలి ఆదేశించింది. అంతేగాకుండా, కాల్పుల విరమణ ఒప్పందం సజావుగా అమలయ్యేలా చూడాలని అమెరికా, రష్యా దేశాలను కోరింది. ఈ మేరకు ఉల్లంఘనలు నమోదు చేసేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. సిరియాలో కాల్పుల విరమణ ఒప్పందంతో తమకేమీ సంబంధంలేదని, డమాస్కస్ బలగాలపై పోరు కొనసాగించాలని నిర్ణయించామని జైష్-ఎల్-నస్ర్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మొహమ్మద్ రషీద్ సోమవారం రాయిటర్స్ వార్తాసంస్థకు తెలిపారు. ఇదిలా ఉండగా, జైష్-ఎల్-నస్ర్ ఉగ్రవాద సంస్థ గతేడాది ఆగస్టులో ఆవిర్భవించింది. ఇద్లెబ్, హామా తదితర నగరాల్లో ఆ సంస్థ కార్యకలాపాలు చురుకుగా కొనసాగుతున్నాయి. అయితే, ఎఫ్ఎస్ఏ ( ఫ్రీ సిరియన్ ఆర్మీ ) ఆ సంస్థకు సహకరిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈఏడాది మార్చి 12న కఫ్ర్ నబూదా నగరంలో సిరియా సైనిక దళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానాన్ని జైష్-ఎల్-నస్ర్ ఉగ్రవాదులు కూల్చివేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







