మలేషియా: టిఆర్ఎస్ ఎం.ఎల్.ఏ తో మీట్ & గ్రీట్ కార్యక్రమం

- October 02, 2022 , by Maagulf
మలేషియా: టిఆర్ఎస్ ఎం.ఎల్.ఏ తో మీట్ & గ్రీట్ కార్యక్రమం

కౌలాలంపూర్: తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగ సందర్బంగా మలేషియా లో  మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తుంగతుర్తి శాసన సభ్యులు గాదారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా మలేషియాలో ఇంత ఘనంగా బతుకమ్మ సంబరాలను జరుపుతున్న సభ్యులను అభినందించారు. 

మరుసటిరోజు ఎం.ఎల్.ఏ తెరాస మలేషియా సభ్యులతో అల్పాహార విందులో పాల్గొన్నారు. మలేషియా తెరాస అధ్యక్షులు చిరుత చిట్టిబాబు ఆధ్వర్యంలో జరిపిన వివిధ కార్యక్రమాలను కొనియాడారు.ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ల విషయంలో తెరాస మలేషియా చూపిన చొరవను అభినందించారు.  

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మారుతి కుర్మ, కార్యదర్శి సందీప్ కుమార్ లగిశెట్టి, కోర్ కమిటీ సభ్యులు మునిగల అరుణ్, బొడ్డు తిరుపతి,గద్దె జీవన్ కుమార్, రమేష్ గౌరు, సత్యనారాయణరావ్ నడిపెల్లి, నవీన్ గౌడ్ పంజాల, హరీష్ గుడిపాటి, రవిందర్ రెడ్డి మరియు ఇతర సభ్యులు శ్యామ్, సంపత్ రెడ్డి, పూర్ణ చందర్ రావు, కిషోర్ పాల్గొనడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com