'కుమారి 21 ఎఫ్' చిత్రం కన్నడలో..
- April 18, 2016
రాజ్ తరుణ్, హేబాపటేల్ జంటగా రూపొంది తెలుగునాట ఘనవిజయం సాధించిన చిత్రం 'కుమారి 21 ఎఫ్'. సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రాన్ని శ్రీమాన్ దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో సెవెన్ ఛానల్ మాణిక్యం నారాయణన్, శ్రీలక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఎ.ఎన్.బాలాజీ సంయుక్తంగా కన్నడలో రీమేక్ చేస్తున్నారు. 'గత 9 ఏండ్లుగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ దర్శకత్వ శాఖలో మంచి అనుభవం సంపాదించిన శ్రీమాన్ ఈ చిత్రంతో దర్శకుడిగా మారడం ఆనందంగా ఉంది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ కుమారుడు సాగర్ మహతి సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ కె.కె.సెంథిల్ కుమార్ దగ్గర వర్క్ చేసి 'గుంటూరు టాకీస్', 'ఒక మనసు' చిత్రాలకు కెమెరామెన్‌గా పనిచేసిన రామిరెడ్డి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో నటించే నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి' అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!









