కువైట్‌కు భారత నౌకాదళ నౌకలు.. విజిటింగ్ సమాయాల్లో మార్పులు
- October 04, 2022
కువైట్: మూడు భారత నౌకాదళ నౌకలు INS TIR, INR సుజాత, ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ICGS సారథి అక్టోబర్ 4వ తేదీన కువైట్‌కు చేరుకుంటున్నాయి. ఇప్పటికే వీటిని సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో ఇండియన్ కమ్యూనిటీ సభ్యులు భారత రాయబార కార్యాలయంలో నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నౌకల సందర్శన కోసం భారతీయ కమ్యూనిటీ సభ్యుల నుండి భారీ స్పందన కారణంగా, పూర్తి సమాచారంతో నమోదు చేసుకున్న వారికి విజిటింగ్ టైమ్ స్లాట్‌లను తిరిగి కేటాయించినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. విజయవంతంగా నమోదు చేసుకున్న వారందరికీ అవసరమైన సూచనలతో పాటు సమయ స్లాట్‌లతో కూడిన నిర్ధారణ ఇమెయిల్‌ను పంపినట్లు రాయబార కార్యాలయం పేర్కొంది. ప్రతి ఒక్కరూ వారి ఇమెయిల్‌ను తనిఖీ చేసి.. వారి సివిల్ ఐడీలు, నిర్ధారణ ఇమెయిల్ కాపీతో రీ-అలాట్ చేసిన సమయ స్లాట్‌లకు కనీసం 15 నిమిషాల ముందు షువైఖ్ పోర్ట్ ప్రధాన గేట్‌కు చేరుకోవాలని ఎంబసీ సూచించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్‌లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్‌లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్‌లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







