‘హెల్తీ సిటీస్’గా ఖతార్ మున్సిపాలిటీలు.. డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు
- October 04, 2022
దోహా: ఖతార్‌లోని అన్ని మునిసిపాలిటీలను "హెల్తీ సిటీస్"గా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ధృవీకరించింది. తూర్పు మధ్యధరా ప్రాంతంలో తన అన్ని నగరాలకు గుర్తింపు పొందిన మొదటి దేశంగా ఖతార్ అవతరించింది. దాంతోపాటు ఖతార్ విశ్వవిద్యాలయం "హెల్తీ యూనివర్శిటీ"గా సర్టిఫికేట్ పొందింది. అలాగే ఖతార్ ఫౌండేషన్ (క్యూఎఫ్) ఎడ్యుకేషన్ సిటీలో స్థానం సంపాదించింది. దీనికి గతంలో "హెల్తీ ఎడ్యుకేషన్ సిటీ" అని పేరు పెట్టారు. ఈ మేరకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ప్రజారోగ్య మంత్రి, హెచ్‌ఈ డాక్టర్ హనన్ మహ్మద్ అల్ కువారి మాట్లాడుతూ.. "అన్ని మునిసిపాలిటీలను ఆరోగ్య నగరాలుగా, ఖతార్ యూనివర్శిటీకి అదనంగా "హెల్తీ యూనివర్శిటీ", క్యూఎఫ్ ఎడ్యుకేషన్ సిటీని "హెల్తీ ఎడ్యుకేషన్ సిటీ"గా గుర్తింపు రావడం గొప్ప విజయంగా అభివర్ణించారు. అమీర్, హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ ముందుదృష్టి, మార్గనిర్దేశంతోనే ఈ విజయం సాధ్యమైందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 అభిమానులను స్వాగతించడానికి ఖతార్ ఎదురు చూస్తోందని, ఈ ఈవెంట్‌లో ఖతార్ అతిథుల సానుకూల అనుభవాన్ని ప్రోత్సహించడానికి ఖతార్ హెల్తీ సిటీస్ గుర్తింపు దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపాలిటీ మంత్రి, HE అబ్దుల్లా బిన్ అబ్దులాజీజ్ బిన్ తుర్కీ అల్ సుబాయి, ఖతార్ విశ్వవిద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ హసన్ రషీద్ అల్ డెర్హామ్, WHO తూర్పు మెడిటరేనియన్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ అహ్మద్ అల్ మంధారి తదితరులు పాల్గొని మాట్లాడారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







