ఈ-టికెట్ పార్కింగ్ వ్యవస్థను ప్రకటించిన అబుధాబి

- October 04, 2022 , by Maagulf
ఈ-టికెట్ పార్కింగ్ వ్యవస్థను ప్రకటించిన అబుధాబి

అబుధాబి: వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం, పబ్లిక్ పార్కింగ్ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచే చర్యల్లో భాగంగా ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ సెంటర్ (ITC)ను అప్‌గ్రేడ్ చేసినట్లు మునిసిపాలిటీలు, రవాణా శాఖ (DMT) ప్రకటించింది. అన్ని పార్కింగ్ చెల్లింపు యంత్రాలను 5G స్మార్ట్ సిస్టమ్‌కు అనుసంధానం చేసినట్లు తెలిపింది. సెంట్రల్ పార్కింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌కు నేరుగా అనుసంధానించబడిన స్మార్ట్ ఇంటర్‌ఫేస్‌లలో తాజా సాంకేతికతను ఇన్‌స్టాల్ చేయడంతో స్మార్ట్ డిజిటల్ ఇంటిగ్రేటెడ్ నెట్‌వర్క్ ద్వారా పబ్లిక్ పార్కింగ్ ప్రాంతాల నిర్వహణను సిస్టమ్ అనుమతిస్తుందని వివరించారు. కొత్త అప్‌గ్రేడ్‌లో పేపర్ వెర్షన్ ను దశలవారీగా నిలిపివేసి.. వాటి స్థానంలో ఎలక్ట్రానిక్‌గా పార్కింగ్ టిక్కెట్‌లు జారీ చేయబడతాయన్నారు. పార్కింగ్ కేటగిరీ ఎంపిక, వాహన సమాచారం (ప్లేట్ కేటగిరీ, నంబర్ మొదలైనవి), పార్కింగ్ వ్యవధి, అలాగే తగిన చెల్లింపు పద్ధతితో సహా డిజిటల్ స్క్రీన్‌పై వివరించిన కొన్ని సాధారణ దశలను అనుసరించడం ద్వారా కస్టమర్‌లు ఇ-టికెట్‌ను పొందవచ్చని వెల్లడించారు. Mawaqif కార్డ్‌లు, నగదు, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లతో సహా అనేక అందుబాటులో ఉన్న ఎంపికల ద్వారా చెల్లింపులు చేయొచ్చన్నారు. కొత్త స్మార్ట్ స్క్రీన్‌లు ఎమిరేట్‌లోని అన్ని పార్కింగ్ ఎంపికల కోసం అవసరమైన సమాచారాన్ని నమోదు చేయడానికి.. సరైన ఇ-టికెట్ రకాన్ని ఎంచుకోవడానికి వినియోగదారులను అనుమతిస్తాయని తెలిపారు. 5G సాంకేతికతతో పనిచేసే 1,200 కంటే ఎక్కువ పరికరాలు ఇన్‌స్టాల్ చేస్తామని, మొత్తం ప్రక్రియ ఈ సంవత్సరం చివరిలోపు పూర్తవుతుందని DMT వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com