‘ఆదిపురుష్’ని బ్యాన్ చేయాలి.? ఏంటీ కొత్త రచ్చ గురూ.!
- October 04, 2022
ప్రబాస్ హీరోగా రూపొందుతోన్న సినిమా ‘ఆది పురుష్’. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ దృష్ట్యా సినిమాని బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతోంది.
అసలెందుకు ‘ఆది పురుష్’ని బ్యాన్ చేయాలి.? టీజర్ చూశాకా అనేక అనుమానాలు. హిందూ మతాన్ని అవమానించేలా ఈ సినిమాలోని క్యారెక్టర్ డిజైన్లు వున్నాయని రచ్చ వీరుల అభిప్రాయం.
రాముడు అంటే, ప్రశాంత వదనం, శాంత స్వరూపం. అలాంటిది ఈ సినిమాలో రాముడి పాత్రని ఓ వీరుడిలా చూపించారని సో కాల్డ్ రచ్చ వీరులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే, రావణుడి పాత్రను ముశ్లిం పాత్ర ఛాయలతో తీర్చిదిద్దారనీ అంటున్నారు. అంతేకాదు, హనుమంతుడి పాత్ర చిత్రీకరణ విషయంలోనూ అంతగా సంతృప్తికరంగా లేరుట.
ఇలా ప్రధాన పాత్రల చిత్రీకరణలోనే ఇంత నిర్లక్ష్యం వహించిన ఈ సినిమాని రిలీజ్ కానివ్వకూడదనేది వారి డిమాండ్. ‘రామాయణం’ బ్యాక్ డ్రాప్‌ని కథాంశంగా ఎంచుకోవడమంటే అంత చిన్న విషయం కాదు. అసలే మనో భావాల పేరు చెప్పి ఈ మధ్య జరుగుతున్న చర్చలు, గొడవల సంగతి తెలిసి కూడా ఇలాంటి సాహసం చేయడం ఎంతవరకూ సబబు.?
సర్లే చేస్తే చేశారు. టీజర్ విషయంలో ఇంత లైట్‌గా వుంటే, ఇక సినిమాలో ఇలాంటి తప్పులు ఇంకెన్ని చేసుంటారో కదా.!
తాజా వార్తలు
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







