ఆ రొమాంటిక్ జంటతో బిగ్‌బాస్‌కి కొత్త గ్లామర్ నిజమేనా.?

- October 04, 2022 , by Maagulf
ఆ రొమాంటిక్ జంటతో బిగ్‌బాస్‌కి కొత్త గ్లామర్ నిజమేనా.?

సుధీర్, రష్మిల జంటకు బుల్లితెర పై ఏ రేంజ్ క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుధీర్ అంటే, పిచ్చ కామెడీ గుర్తొస్తుంది. రష్మి అంటే హాట్ అప్పీల్. పక్కా గ్లామర్ ఐటెం. సో, ఈ ఇద్దరూ కలిస్తే, గ్లామర్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్.. పక్కా పైసా వసూల్ అంతే.
ఈ పైసా వసూల్‌ని క్యాష్ చేసుకోవడానికి ఈ రొమాంటిక్ జంటని బిగ్‌బాస్ వాడుకోవాలనుకుంటున్నాడట. అవునండీ మీరు విన్నది నిజమే.! బిగ్‌బాస్ హౌస్‌లో ఈ రొమాంటిక్ కపుల్ సందడి చేయబోతున్నారట. 
బిగ్‌బాస్ స్టార్టయ్యి అప్పుడే మూడు వారాలు దాటుతున్నా, రావల్సిన క్రేజ్ దక్కించుకోలేదు. టీఆర్‌పీ రేటింగుల్లోనూ చాలా వెనకబడిపోయిందట బిగ్‌బాస్. దాంతో, సరికొత్త క్రేజ్ అప్లై చేయడానికి బిగ్‌బాస్ వాడుతున్న అస్త్రం రష్మి, సుధీర్‌ల జంట. 
ఈ జంటను అతి త్వరలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోపలికి పంపించబోతున్నారనీ గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వీరిద్దరూ క్వారంటైన్‌లో వున్నారనీ సమాచారం. 
త్వరలోనే టైమ్ చూసుకుని హౌష్‌లోకి షాకింగ్ ఎంట్రీ ఇవ్వనున్నారట. ఇప్పటికే జబర్దస్త్ టీమ్ నుంచి చంటి, ఫైమా వంటి వారు హౌస్‌లో వున్నప్పటికీ రావల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్ వారి నుంచి రావడం లేదు. సో, సుధీర్, రష్మి వుంటే అయినా షోకి కొత్త క్రేజ్ వస్తుందేమో చూడాలి మరి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com