‘పుష్ప’పై ఏంటి భయ్యా ఈ నెగిటివిటీ.! ‘పుష్ప 2’పై ఇంపాక్ట్ పడదా.?

- October 04, 2022 , by Maagulf
‘పుష్ప’పై ఏంటి భయ్యా ఈ నెగిటివిటీ.! ‘పుష్ప 2’పై ఇంపాక్ట్ పడదా.?

2021 చివరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి, సెన్సేషనల్ విజయం అందుకున్న సినిమా ‘పుష్ప’. విడుదలై ఇంత కాలం గడుస్తున్నా, ‘పుష్ప’ మేనియా ఓ పట్టాన తగ్గలేదనే చెప్పాలి. ‘తగ్తేదే లే’ అనే డైలాగ్, కొన్ని కొన్ని సిగ్నేచర్ మేనరిజమ్స్, పాటలు.. ఇలా చాలానే వున్నాయ్. 
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ విదేశాల్లోనూ ‘పుష్ప’ మేనియా మామూలుగా లేదు. అలాంటిది ఇప్పుడు కొత్తగా ‘పుష్ప’ ఫ్లాప్ సినిమా అంటూ కొత్త చర్చ బయటికి వచ్చింది. అందుకు కారణం డైరెక్టర్ తేజ. 
ఈయన తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘పుష్ప’ ఫ్లాప్ సినిమా అంటూ ప్రూప్స్ కూడా కుండ బద్దలుకొట్టేశాడు. దాంతో అసలు సినిమా బయటికొచ్చింది. అవును నిజమే, ‘పుష్ప’ ఫ్లాప్ సినిమానే. నిర్మాతలకు సైతం బోలెడన్ని నష్టాలు మిగిల్చింది ఈ సినిమా అంటూ మరికొందరు అజ్ఞాతవ్యక్తులు బయటికి వచ్చారు.
అదేంటీ.? నిర్మాతలకు నష్టాలు మిగిలితే, ఈ మద్య అస్సలు ఊరుకోవడం లేదుగా. బయటికొచ్చి నష్టపరిహారాలిచ్చేంతవరకూ వదలట్లేదుగా.. అంటారా.! అదీ జరిగిందట ‘పుష్ప’ విషయంలో తెర వెనకాల. అయితే, అల్లు అరవింద్ గురించి తెలిసిందేగా. తెలివిగా అలాంటోళ్ల నోర్లు తెర వెనుకే కామ్‌గా మూయించేశాడనీ మాట్లాడుకుంటున్నారు.
‘పుష్ప ది రైజ్’ విషయమై తాజాగా సోషల్ మీడియాలో నడుస్తున్న ఈ చర్చ ఒకింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అలాగే, ఈ ఇంపాక్ట్‌తో ఇప్పటికే లేటుగా సెట్స్ మీదికి వెళ్లిన ‘పుష్ప 2’ ఎలా పూర్తవుతుంది.? ఎప్పుడు తెరపైకి వస్తుందనే అనుమానాలకు మరింత బలం చేకూరినట్లయ్యింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com