ప్రవాస వీసా దారులకు శుభవార్త.. మెడికల్ టెస్ట్ ఫీజు తగ్గించిన ఒమన్
- October 06, 2022
మస్కట్: 2022 నవంబర్ 1 నుండి ఒమన్ సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లో కొత్త రెసిడెన్సీ పర్మిట్లు లేదా రెసిడెన్సీ వీసాలను పునరుద్ధరించుకునే వారికి ఒమన్ శుభవార్త చెప్పింది. వీసాలు పొందాలనుకునే ప్రవాసులను పరీక్షించడానికి ప్రైవేట్ ఆరోగ్య సంస్థలలో నిర్వహించే మెడికల్ పరీక్షల రుసుములను మినహాయించనున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోగ్య మంత్రి డాక్టర్ హిలాల్ బిన్ అలీ అల్-సబ్తీ తెలిపారు. OMR30 రుసుము చెల్లించిన తర్వాత ప్రవాసులు.. మెడికల్ పరీక్ష కోసం అభ్యర్థనను సనద్ కార్యాలయాల ద్వారా సమర్పించాలని సూచించారు. ఆ తర్వాత ప్రవాసులు ఎలాంటి రుసుము చెల్లించకుండానే ప్రైవేట్ వైద్య పరీక్షా కేంద్రాల్లో అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఉత్తర్వుల్లో ఆరోగ్య మంత్రి డాక్టర్ హిలాల్ బిన్ అలీ అల్-సబ్తీ తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్‌లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







