రేస్‌లో కింగ్ నాగార్జున వెనకబడిపోయాడే.! నాగ్ ప్రయోగం వికటించిందే.!
- October 06, 2022
చిన్న సినిమాలతోనే జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుకి పిలిచి మరీ అవకాశమిచ్చాడు నాగార్జున. అలాంటిది నాగార్జున వంటి స్టార్ హీరోతో ప్రవీణ్ సత్తారు తీసే సినిమా అంటే, ఖచ్చితంగా అంచనాలుంటాయ్. ప్రమోషన్లు కూడా చాలా బాగా చేశారు ఈ సినిమాకి.
ఎమోషన్‌కి యాక్షన్ లింక్ సెట్ చేసి, కథా, కథనాలను నడిపిన చిత్రమిది. హై ప్రొఫైల్ ఫ్యామిలీకి చెందిన తన అక్కనీ, అక్క కూతురునీ ప్రాణ హాని నుంచి కాపాడే పాత్రలో నాగార్జున నటించాడు. నిజానికి వృత్తి పరంగా నాగార్జున పవర్ ఫుల్ ఇంటర్‌పోల్ ఆపీసర్. అలాంటి ఓ పవర్ ఫుల్ జాబ్‌లో వుంటూ, తన కుటుంబం ప్రమాదంలో వుందని తెలిసి, వాళ్లని రక్షించే ప్రయత్నంతో మరింత పవర్ ఫుల్ మేన్‌గా మారతాడు. అదే ఈ సినిమా కథ.
సినిమా నిండా యాక్షన్ ఎపిసోడ్సే. కానీ, ఆ ఇంటెన్స్ యాక్షన్ సీన్స్‌కి తగ్గ ప్లాట్‌ఫామ్‌ని సెట్ చేయడంలో డైరెక్టర్ ఫెయిలయ్యాడు. తన ఏజ్‌కి మించి నాగార్జున యాక్షన్ బాడీని మేకోవర్ చేసుకున్నాడు. ఆ విషయంలో నాగ్‌ని మెచ్చుకోకుండా వుండలేం. తన ఇమేజ్‌కి తగ్గట్లుగా హీరోయిన్‌తో లవ్ ట్రాక్, రొమాంటిక్ సీన్స్.. బాగానే పండించేశాడు.
డైరెక్టర్ ఏం చెబితే అది చేశాడు. క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయిపోయాడు. కానీ, ఎందుకో ప్రవీణ్ సత్తారు ఈ స్ర్టాంగ్ కథని ప్రెజెంట్ చేయడంలో కాస్త తడబడ్డాడు. అదే ‘ది ఘోస్ట్’ని అంచాలను అందుకోలేకుండా చేసింది. ప్రమోషన్లలో కనిపించినం ఇంటెన్సిటీ సినిమాలో కనిపించలేదు. దాంతో, పాపం నాగార్జున ఎంత కష్టపడినా ‘ది ఘోస్ట్’ కాస్త నిరాశ పరిచిందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయ్.
తాజా వార్తలు
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్‌కీ 100 మిలియన్ డాలర్ల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్‌లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం







