పార్కింగ్‌లో కొత్త టెక్నాలజీపై చర్చ
- April 19, 2016
స్మార్ట్ పార్కింగ్ ఖతార్ కాన్ఫరెన్స్‌లో, పార్కింగ్ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులు, కొత్తగా వస్తున్న సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంపై చర్చ జరిగింది. దేశంలో పార్కింగ్ ప్రాంతాల్ని టెక్నాలజీతో అనుసంధానం చేయడం, కొత్తగా పార్కింగ్ కేంద్రాల్ని పెంచడం, తగిన సౌకర్యాలు కల్పించడంపై చర్చించారు. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ మరియు ఎన్విరాన్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్గల్), ఖతార్ రైల్ మరియు ఖతార్ ఫౌండేషన్ ఈ కాన్ఫరెన్స్‌కి హాజరయ్యాయి. పలు ప్రెజెంటేషన్లు, కేస్ స్టడీస్ మరియు ప్యానెల్ డిస్కషన్స్‌తో కాన్ఫరెన్స్ జరిగింది. అడ్వాన్స్ ఖతార్ నేషనల్ స్ట్రేటజీస్ కోసం స్మార్ట్ పార్కింగ్ టెక్నాలజీని వినియోగించుకోవడం గురించి ఆసక్తికరమైన చర్చ చోటుచేసుకుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ట్రాన్స్పో గ్రూప్, కెఇఓ ఇంటర్నేషనల్, ఇంటిగ్రేటెడ్ ఎన్విరాన్మెంటల్ సర్వీసెస్, ఖతార్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, అరబ్ ఇంజనీరింగ్ బ్యూరో కుండాల్ కతార్, జెఫ్సన్ కాంట్రాక్టింగ్ సంస్థల ప్రతినిథులు ఈ రోజు కాన్ఫరెన్స్‌లో ప్రసంగించనున్నారు.
తాజా వార్తలు
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!









