సౌదీలో చట్టాలు ఉల్లంఘించిన 15,894 మంది అరెస్టు
- October 09, 2022
రియాద్ : రెసిడెన్సీ, కార్మిక చట్టాలు, సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన సుమారు 15,894 మందిని ఒక వారంలో కింగ్డమ్లోని వివిధ ప్రాంతాలలో అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 5 వరకు వారంలో రాజ్యమంతటా వివిధ భద్రతా దళాలు నిర్వహించిన ఉమ్మడి క్షేత్ర తనిఖీల సందర్భంగా వీరిని అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. ఇందులో 9,192 మంది రెసిడెన్సీ, 3,968 మంది సరిహద్దు భద్రతా నియమాలు, 2,734 మంది కార్మిక చట్టాలను ఉల్లంఘించినవారు ఉన్నారు. రాజ్యంలోకి సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు మరో 313 మంది అరెస్టయ్యారు. అరెస్టయిన వారిలో 51% మంది యెమెన్లు, 37% ఇథియోపియన్లు, 12% ఇతర జాతీయులు ఉండగా.. మరో 42 మంది సౌదీ అరేబియా నుండి బయటికి వెళ్లేందుకు ప్రయత్నించి పట్టుబడ్డారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 48,911 మంది సౌదీ చట్టాలను ఉల్లంఘించినవారని, ఇందులో 45,422 మంది పురుషులు, 3,489 మంది మహిళలు ఉన్నారని తెలిపారు.వారిలో 38,790 మంది తమ ప్రయాణ పత్రాలను పొందేందుకు వారి దౌత్య కార్యాలయాలకు, 2,169 మంది వారి ప్రయాణ రిజర్వేషన్లను పూర్తి చేయడానికి.. 8,234 మంది ఉల్లంఘించిన వారిని బహిష్కరించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎవరైనా చొరబాటుదారులను రాజ్యంలోకి ప్రవేశించడానికి సహాయం అందించిన వారికి గరిష్టంగా 15 సంవత్సరాల జైలు శిక్ష, SR1 మిలియన్ వరకు జరిమానా విధించబడుతుందని అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







