114 మద్యం సీసాలు, డ్రగ్స్ స్వాధీనం.. నలుగురి అరెస్టు
- October 09, 2022
కువైట్ సిటీ: ముబారక్ అల్-కబీర్లోని సభాన్ ప్రాంతంలో స్థానికంగా శుద్ధి చేసిన 114 మద్యం బాటిళ్లతోపాటు డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు సెక్యూరిటీ పెట్రోలింగ్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అరెస్టు చేశామన్నారు. అరెస్టు సమయంలో ఇద్దరు నిందితులు మత్తులో ఉన్నారని తెలిపారు. అరెస్ట్ చేసే సమయంలో నిందితులు తప్పించుకునే ప్రయత్నంలో తమ కారుతో పెట్రోలింగ్ కారును ఢీకొట్టినట్లు వివరించారు. ఆ ఇద్దరు నిందితులను ఖురైన్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నామని, ఆ సమయంలో వారిద్దరు మత్తులో ఉన్నారని.. వారివద్ద డ్రగ్స్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు అప్పగించినట్లు పెట్రోలింగ్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







