బిగ్ ఎలిమినేషన్.! చలాకి చంటిని గెంటేసిన బిగ్‌బాస్.!

- October 10, 2022 , by Maagulf
బిగ్ ఎలిమినేషన్.! చలాకి చంటిని గెంటేసిన బిగ్‌బాస్.!

బుల్లితెర గేమ్ షో బిగ్‌బాస్ తాజా ఎలిమినేషన్‌లో భాగంగా జబర్దస్త్ ఫేమ్ చలాకి చంటి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. సారీ, చంటి ఎలిమినేట్ అయ్యాడు.. అనేదానికన్నా, హౌస్ నుంచి తానే కావాలని బయటికి వచ్చేశాడు.. అనడం సబబేమో.
ఎందుకంటే, బిగ్‌బాస్ గేమ్ షోకి వెళ్తే, తమకున్న టాలెంట్ చచ్చిపోతుంది.. అనే అభిప్రాయాలు చాలా మందిలో వున్నాయ్. బిగ్‌బాస్ అనేది ఓ డిఫరెంట్ ప్రపంచం. ప్రపంచాన్ని గెలవడం సులువా.? బిగ్‌బాస్‌ని గెలవడం సులువా.? అని అడిగితే, కొన్ని సందర్భాల్లో ప్రపంచాన్నే గెలవడమే సులువు.. అని స్టేట్‌మెంట్ ఇస్తున్నారు హౌస్ నుంచి బయటికి వచ్చిన చలాకి చంటి.
అంటే, బిగ్‌బాస్ హౌస్‌లో వుండడం అనేది అంత ఆషా మాషీ కాదని ఆయన క్లారిటీ ఇచ్చారు. అక్కడే జరిగే ఇష్యూస్‌కీ, బయటికి ప్రొజెక్ట్ అయ్యే ఇష్యూస్‌కీ అస్సలేమాత్రం సంబంధం వుండదని ఆయన చెబుతున్నారు.
‘వీడికి గేమ్ ఆడడం చేతకాదురా..’ అని బయటి నుంచి చూస్తున్న జనం మాట్లాడేయడం చాలా ఈజీ. కానీ, లోపల వుండి, గేమ్ ఆడుతున్నామా.? లేదా.? అనేది హౌస్‌లో వున్న మాకు మాత్రమే తెలిసిన విషయం. అయినా బిగ్‌బాస్‌లో మనం ఊహించినది ఏదీ ఊహించినట్లు జరగనే జరగదు. కావాలనే బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చేశా.. అంటూ చలాకి చంటి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com