ఒమన్ సైన్స్ ఫెస్టివల్ 2022 ప్రారంభం

- October 11, 2022 , by Maagulf
ఒమన్ సైన్స్ ఫెస్టివల్ 2022 ప్రారంభం

మస్కట్: ఒమన్ సైన్స్ ఫెస్టివల్ 2022 మూడో ఎడిషన్ ప్రారంభమైంది. రవాణా, కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి ఇంజినీర్ హమూద్ అల్ మవాలీ ఈ వేడుకలను ప్రారంభారు. ఆరు రోజులపాటు జరిగే ఈ ఈవెంట్ ను "టుగెదర్ వి లివ్ ది ప్యాషన్ ఆఫ్ సైన్స్" అనే థీమ్ తో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యా మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ, ఫెస్టివల్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ అబ్దుల్లా ఖమీస్ అంబోసైది మాట్లాడుతూ.. ఈ జాతీయ పండుగ విస్తృతమైనదన్నారు. ఈ ఏడాది హాళ్లు, ఈవెంట్‌లు, కార్యకలాపాలు, సెమినార్‌లు, వర్క్‌షాప్‌లు పెరిగాయని వివరించారు. ప్రారంభ వేడుకలో ఒమన్ సైన్స్ ఫెస్టివల్ పరిచయ చిత్రాన్ని ప్రదర్శించారు. ఇందులో అనేక ఇంటరాక్టివ్ శాస్త్రీయ కార్యకలాపాలు, వర్క్‌షాప్‌లు, ఆవిష్కరణల శాస్త్రీయ ప్రదర్శనలు, శాస్త్రీయ ప్రయోగాలు, శాస్త్రీయ పోటీలు, ఉపన్యాసాలు, చర్చా సెషన్‌లు, శాస్త్రీయ థియేటర్‌లు ఉన్నాయి. దీనితోపాటు హెల్త్ కార్నర్ లో 46 యాక్టివిటీలు, ఎడ్యుకేషన్ కార్నర్‌లో 18 యాక్టివిటీలు, స్కిల్స్ కార్నర్‌లో 3 యాక్టివిటీలు, కామర్స్ అండ్ ట్రేడింగ్ కార్నర్‌లో 20 యాక్టివిటీలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. శాస్త్రీయ ఆవిష్కరణల ప్రదర్శనలో సైనిక సంస్థల నుండి 75 ఆవిష్కరణలు ఉన్నాయన్నారు. స్పేస్, ఏరోనాటిక్స్ కార్నర్‌లో 30 యాక్టివిటీలు ఉండగా.. ఫుడ్ సేఫ్టీ కార్నర్‌లో 21 యాక్టివిటీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్నర్‌లో 25 యాక్టివిటీలు, ఎన్విరాన్‌మెంట్ కార్నర్‌లో 24 వివిధ యాక్టివిటీలు ఉన్నాయి. ఇందులో పలు అంతర్జాతీయ సంస్థలు, ఏజెన్సీలు పాల్గొంటున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com