మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి, చరణ్.!

- October 10, 2022 , by Maagulf
మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి, చరణ్.!

కొరటాల శివ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం ‘ఆచార్య’. కనీ వినీ ఎరుగని కాంబినేషన్. మెగాస్టార్ సతీమణి సురేఖ కలల ప్రాజెక్టుగా రూపొందిన ఈ సినిమా భారీ డిజాస్టర్‌గా నిలిచింది. అరుదైన కాంబినేషన్‌ ఆ రకంగా వేస్ట్ అయిపోయిందన్న ఆవేదన మెగా అభిమానుల్లో నరనరాల నిండిపోయింది.
ఆ లోటు తీర్చేందుకు మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయట. ఈ సారి ఈ కాంబినేషన్‌కి డైరెక్షన్ బాధ్యతలు తీసుకోనున్నారు మోహన్ రాజా. ‘గాడ్ ఫాదర్’ సినిమాతో మోహన్ రాజాపై గట్టిగా నమ్మకం ఏర్పడింది మెగాస్టార్ చిరంజీవికి.
దాంతో, డిజప్పాయింట్ చేసిన ఈ కాంబినేషన్‌తో మరోసారి హిట్ కొట్టి, ఫ్యాన్స్‌ని శాటిస్‌పై చేయాలని అనుకుంటున్నారట. ఈ అతిపెద్ద బాధ్యతను మోహన్ రాజా భుజాలపై వేసినట్లు తెలుస్తోంది. ఓ సూపర్ హిట్ రీమేక్ కోసం వేట మొదలు పెట్టారట. త్వరలోనే డీటెయిల్స్ బయటికి రానున్నాయని సమాచారం. 
ఈ కాంబినేషన్ మూవీని కొణిదెల ప్రాడక్షన్స్ బ్యానర్‌లోనే ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్నారట. ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’గా చిరంజీవి రికార్డులు బ్రేక్ చేసే పనిలో బిజీగా వున్న సంగతి తెలిసిందే. మరోవైపు రామ్ చరణ్, శంకర్ మూవీతో బిజీగా వున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com