బహ్రెయిన్ లో ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించిన అభ్యర్థిపై విచారణ
- October 11, 2022
బహ్రెయిన్ : ఒక పార్లమెంటరీ అభ్యర్థి, మరొక వ్యక్తితో కలిసి ఒక పాఠశాలలో ప్రచారం చేస్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. దీనిపై ఎన్నికల నేరాల దర్యాప్తు కమిటీకి అవినీతి నిరోధక, ఆర్థిక, ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ జనరల్ డైరెక్టరేట్ సైబర్ క్రైమ్ విభాగం ఫిర్యాదు చేసింది. దీంతో అత్యవసర విచారణకు హాజరుకావాలని సదరు అభ్యర్థి, వీడియోలోని రెండవ వ్యక్తికి నోటీసులు జారీ చేశామని, వారికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలను సేకరిస్తున్నట్లు అడ్వకేట్ జనరల్, హెడ్ ఎలక్టోరల్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ కమిటీ వెల్లడించింది. షురా, రిప్రజెంటేటివ్స్ కౌన్సిల్లకు సంబంధించి 2002 నాటి డిక్రీ-లా నెం. 15.. అభ్యర్థుల ఎన్నికల ప్రచార నిబంధనలను తెలియజేస్తోంది. ప్రార్థనా స్థలాలు, విశ్వవిద్యాలయాలు, శాస్త్రీయ సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఎన్నికల ప్రసంగాలు చేయడాన్ని ఈ చట్టం నిషేధిస్తుంది. వీటితోపాటు మంత్రిత్వ శాఖలు, వాటి అనుబంధ విభాగాలు, ఏజెన్సీలు, ప్రభుత్వ సంస్థల వద్ద ఎన్నికల ప్రచారాలు నిషేధం. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఒక సంవత్సరం వరకు జైలుశిక్ష, BD1000 వరకు జరిమానా విధించబడుతుందని అడ్వకేట్ జనరల్ వెల్లడించారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







