రెండు నెలల్లో 6,112 మందిని బహిష్కరించిన కువైట్
- October 11, 2022
కువైట్: రెసిడెన్సీ, వర్క్ చట్టాన్ని ఉల్లంఘించిన 6,112 మందిని గత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో బహిష్కరించినట్లు కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ (MoI) తెలిపింది. రెసిడెన్సీ వ్యవహారాల ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ చేపట్టిన తనిఖీల్లో ఆగస్టులో 585, సెప్టెంబర్‌లో 204 మంది సహా 789 మంది చట్టాలను ఉల్లంఘించిన వారిని అరెస్టు చేసినట్లు మంత్రిత్వ శాఖ భద్రతా మీడియా, పబ్లిక్ రిలేషన్స్ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 6 వరకు మరో 45 మందిని ఇదే కారణంతో అరెస్టు చేసినట్లు పేర్కొంది. పౌరులు, నివాసితులు భద్రతా సిబ్బందితో సహకరించాలని కోరింది. రెసిడెన్సీ, వర్క్ చట్టాలను అందరూ గౌరవించాలని, ఉల్లంఘనదారుల గురించిన సమాచారాన్ని దాచవద్దని, సంబంధిత అధికారులకు సమాచారాన్ని తెలపాలని విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







