కింగ్ ‘సత్తా’ చాటలేకపోయాడు.! ప్రిన్స్ ‘సత్తా’ ఎంతో.!

- October 11, 2022 , by Maagulf
కింగ్ ‘సత్తా’ చాటలేకపోయాడు.! ప్రిన్స్ ‘సత్తా’ ఎంతో.!

‘ది ఘోస్ట్’ అంటూ కింగ్ నాగార్జునతో ఓ యాక్షన్ సినిమా తీసేశాడు ప్రవీణ్ సత్తారు. కానీ, అది ఫ్లాప్ అయ్యింది. కొంచెం కూడా గ్యాప్ తీసుకోకుండా, ఇప్పుడు ప్రిన్స్‌ని పట్టాలెక్కించేశాడు. అదేనండీ, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో ప్రవీణ్ సత్తారు తన కొత్త సినిమాకి శ్రీకారం చుట్టేశాడు.
సోమవారం ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ విషయాన్ని తెలియపరుస్తూ, టీమ్ ఓ మేకింగ్ వీడియోని రిలీజ్ చేసింది. ఈ మేకింగ్ వీడియోలో మెగా ప్రిన్స్ చాలా ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నాడు. ఇది కూడా యాక్షన్ నేపథ్యంలో రూపొందబోతున్న సినిమా అని మేకింగ్ వీడియోని బట్టి అర్ధమవుతోంది.
ఆల్రెడీ ఓ యాక్షన్ డిజాస్టర్ అయ్యింది. మళ్లీ యాక్షన్‌నే నమ్ముకున్నాడు ప్రవీణ్ సత్తారు. మరి, ఆయన నమ్మకం ఏంటో కానీ, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సైడ్ నుంచి ఆలోచిస్తే, కథల ఎంపికలో వరుణ్‌కి మంచి విజన్ వుంది. ఫ్లాప్ కొట్టి, ఆ వేడి ఇంకా తగ్గకముందే, ప్రవీణ్ సత్తారుతో సినిమా పట్టాలెక్కించాడంటే, సమ్‌థింగ్ ఏదో విషయం వున్నట్లే. 
లేటెస్టుగా ఈ సినిమా అప్‌డేట్‌ని సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేస్తూ వెల్లడి చేశాడు వరుణ్ తేజ్. ఈ సినిమాలో ‘ఏజెంట్’ ఫేమ్ సాక్షి వైద్యని హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలు చేస్తోంది వరుణ్ అండ్ టీమ్.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com