‘గాడ్ ఫాదర్’ 100 కోట్ల సినిమా.! అవునా.? కాదా.?
- October 11, 2022
దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గాడ్ ఫాదర్’ సినిమా 100 కోట్ల క్లబ్‌లోకి చేరిందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, ఇది షేర్ కాదట. కేవలం గ్రాస్ మాత్రమే. షేర్ మాటకొస్తే, 50 కోట్లకి అటూ ఇటూ తిరుగాడుతోందట ‘గాడ్ ఫాదర్’. అంటే, ప్రచారంలో వున్నట్లు 100 కోట్లు చేరాలంటే, ఇంకా చాలా చాలా టైమ్ పట్టే అవకాశముంది.
అయితే, దసరా సెలవులు ముగిసిపోయాయ్. వీక్ డేస్ స్టార్టయ్యాయ్. తొలి వీక్ డే అయిన మండేకి వసూళ్లు బాగా పడిపోయాయనీ తెలుస్తోంది. మార్నింగ్, మ్యాట్నీ షోలు దారుణంగా పడిపోయినా, ఫస్ట్ షో, సెకండ్ షోలు కాస్త ఫర్వాలేదనిపించాయట.
అయినా కానీ, నిర్మాతలూ, డిస్ట్రిబ్యూటర్లు ఎలాంటి ఆందోళన చెందడం లేదు. ఎందుకంటే, ఈ సినిమాని చాలా తక్కువ రేట్లకే కొనుగోలు చేశారు. ధియేట్రికల్ బిజినెస్ పరంగా 80 నుంచి 90 కోట్ల వరకూ బిజినెస్ అయ్యిందని ప్రచారం జరిగింది కానీ, అందులో నిజమెంతనేది తెలీదు.
రీమేక్ మూవీ కావడం, అందులోనూ, ఒరిజినల్ మూవీ ‘లూసిఫర్’ తెలుగు వెర్షన్ ఓటీటీలో అందుబాటులో వుండడం వంటి కారణాలతో ‘గాడ్ ఫాదర్’ వసూళ్ల పరంగా పెద్దగా ఎక్స్‌పెక్టేషన్సేమీ లేవు కానీ, మెగాస్టార్ సినిమా అంటే, ఓ మోస్తరుగా వుండాలి కదా. ఈ ట్రేడ్ లెక్కల్ని బట్టి, ‘గాడ్ ఫాదర్’ హిట్టు మూవీనా.? ఫ్లాప్ మూవీనా.? అనే అనుమానాలొస్తున్నాయ్. మరోవైపు రీమేక్ మూవీతో ఆ స్థాయి వసూళ్లు కొల్లగొట్టడమే గొప్ప. దాన్ని మెగాస్టార్ స్టామినాతో పోల్చకూడదంటున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







