దుబాయ్‌లో ఎగిరిన మొదటి ఎలక్ట్రిక్ ఫ్లైయింగ్ కార్..

- October 12, 2022 , by Maagulf
దుబాయ్‌లో ఎగిరిన మొదటి ఎలక్ట్రిక్ ఫ్లైయింగ్ కార్..

దుబాయ్: దుబాయ్‌లో ఒక ‘ఫ్లఫ్లైయింగ్ కార్’ను టెస్ట్ రన్ నిర్వహించారు.ఇది ఎలక్ట్రిక్ ఫ్లైయింగ్ కార్ కావడం మరో విశేషం. చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ‘ఎక్స్ పెంగ్’ అనే సంస్థ ఈ కారును తయారు చేసింది. ఇందులో ఇద్దరు ప్రయాణించే వీలుంది. దీనికి నాలుగు వైపులా కలిపి, ప్రతి వైపు రెండు చొప్పున మొత్తం ఎనిమిది రెక్కలుంటాయి. మానవ రహితంగా ఈ ‘ఫ్లైయింగ్ కార్’ను విజయవంతంగా పరీక్షించారు. దాదాపు 90 నిమిషాలపాటు ఇది ప్రయాణించి, విజయవంతంగా ల్యాండ్ అయింది.ఈ ఫ్లైయింగ్ కార్ గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.GITEX లో ఫ్లైయింగ్ కార్ ను ప్రదర్శించారు.త్వరలోనే అంతర్జాతీయ మార్కెట్లోకి వస్తామని కంపెనీ నిర్వాహకులు తెలిపారు.

గత జూలైలో మనుషులతో ఈ కారు ప్రయాణిచిందని, భవిష్యత్తు ఆవిష్కరణలకు తమ కారు, సాంకేతికత ఉపయోగపడుతుందని కంపెనీ ప్రతినిధులు చెప్పారు.భవిష్యత్తులో పైలట్ లేకుండానే ప్రయాణించగలిగే ఇలాంటి కార్లు మరింతగా అందుబాటులోకి వస్తాయన్నారు. అయితే, దీనికి ముందు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com