మలయాళ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బేబమ్మ.! నాలుగూ కవర్ చేసేస్తోందిగా.!
- October 13, 2022
టాలీవుడ్ విషయానికి వస్తే, ప్రస్తుతం బేబమ్మ కృతిశెట్టి టాప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే, ఈ మధ్య వచ్చిన సినిమాల్లో దాదాపు కృతిశెట్టి నటించిన సినిమాలే ఎక్కువగా వున్నాయ్. సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేుకుంటూ పోతోంది కృతి శెట్టి.
తెలుగు సినిమాలతో పాటూ, తమిల, కన్నడ సినిమాల్లోనూ ఇటీవలే ఛాన్స్ దక్కించుకుంది. ఇక, మిగిలిన మలయాళ ఇండస్ర్టీని కూడా కవర్ చేసేయనుంది త్వరలో ఈ బెంగుళూర్ బ్యూటీ.
మలయాళ నటుడు టోవినో థామస్ హీరోగా రూపొందుతోన్న ఓ సినిమాలో కృతి శెట్టిని హీరోయిన్గా ఎంచుకున్నారట. ఇంతకీ ఎవరీ టోమినో థామస్. ‘గాడ్ ఫాదర్’ ఒరిజినల్ మూవీ ‘లూసిఫర్’ని దాదాపు చాలా మంది చూసే వుంటారు.
ఈ సినిమాలో విదేశాల నుంచి వచ్చి, సీఎం క్యాండిడేట్‌గా పోటీ చేసే కుర్రోడు.. అదేనండీ, మోహన్‌లాల్ తమ్ముడి పాత్ర. సడెన్‌గా షాకిచ్చే క్యారెక్టర్ ఇది. ఈ పాత్రను మర్చిపోయే ఛాన్సే లేదు. తెలుగు వెర్షన్లో ఈ పాత్రను మొత్తానికి లేపేశారనుకోండి. అదీ మన హీరో టోవినో థామస్ గురించిన పరిచయం.
ఈ యంగ్ హీరోతోనే కృతి శెట్టి తన తొలి మలయాళ సినిమాని చేయబోతోందన్న మాట.
తాజా వార్తలు
- ఆకర్షణీయమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా ఒమన్..!!
- గ్లోబల్ మార్కెట్లో సత్తా చాటుతున్న భారత్
- కువైట్ లో వేగంగా మారుతున్న వాతావరణం..!!
- బహ్రెయిన్ లో కేరళ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం..!!
- గాజా బార్డర్స్ తెరవండి..WFP పిలుపు..!!
- దుబాయ్ లో Emirates Loves India చే మెగా దీపావళి ఉత్సవ్
- దళారీలను నమ్మి మోసపోవద్దు: టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు
- మంత్రి లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటన
- ఇండియా VS ఆస్ట్రేలియా: తొలి వన్డే సిరీస్ రేపే ప్రారంభం
- జువెనైల్ హోం లో బాలుర పై లైంగిక దాడులు