మారుతితో ప్రబాస్: సైలెంట్‌గా కానిచ్చేస్తాడా.?

- October 13, 2022 , by Maagulf
మారుతితో ప్రబాస్: సైలెంట్‌గా కానిచ్చేస్తాడా.?

మారుతి డైరెక్షన్‌లో ప్రబాస్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఎప్పుడయితే, ఈ న్యూస్ బయటికి వచ్చిందో, ప్రబాస్ ఫ్యాన్స్ గుస్సా అయిపోయారు. వద్దు బాబోయ్ వద్దు, మారుతితో సినిమానే వద్దు.. అంటూ సోషల్ మీడియా వేదికగా రచ్చ కూడా మొదలెట్టారు.
కానీ, ఫ్యాన్స్ మాటను పెడ చెవిన పెట్టేశాడట ప్రబాస్. ఈ ప్రాజెక్ట్‌ని త్వరలోనే పట్టాలెక్కించేయనున్నాడట. అంతేకాదు, సింపుల్‌గా, లో బడ్జెట్‌తో కామ్‌గా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేసే యోచనలో వున్నట్లు తెలుస్తోంది డార్లింగ్ ప్రబాస్. 
ఈ మధ్య ప్రబాస్ నుంచి వచ్చిన పెద్ద సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయ్. రాబోయే ‘ఆది పురుష్’ సినిమా మీద కూడా రకరకాల విమర్శలూ, కాంట్రవర్సీలు.. దాని భవిష్యత్ ఎలా వుండబోతోందనే విషయంలో సర్వత్రా అనుమానాలున్నాయ్.
ఈ నేపథ్యంలో మారుతిలాంటి చిన్న డైరెక్టర్‌తో ఓ చిన్నపాటి కూల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని కానిచ్చేసి, ఫ్యాన్స్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలనుకుంటున్నాడట ప్రబాస్. అదే పనిలో తెర వెనక బిజీగా వున్నాడట. ఈ సినిమాలో ప్రబాస్‌కి జోడీగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని ప్రచారం జరుగుతోంది. అందులో ఒకరు మాళవిక మోహనన్ కాగా, మరో ఇద్దరు భామల పేర్లు తెలియాల్సి వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com